»Swiggy Says Viral Ad Targeting Zomato Is Fake Amid Pure Veg Controversy
Swiggy: జొమాటో ‘ప్యూర్ వెజ్’ వివాదంలో వస్తున్న యాడ్స్‌పై స్విగ్గీ స్పందించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. దీన్ని అపహాస్యం చేస్తూ.. స్విగ్గీ వివాదస్పదమైన ప్రకటనలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై స్విగ్గీ స్పందించింది.
Swiggy says viral ad targeting Zomato is fake amid ‘pure veg’ controversy
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) శాఖాహారుల కోసం “ప్యూర్ వెజ్ ఫ్లీట్”ను స్థాపించిన విషయం తెలిసిందే. దీన్ని అపహాస్యం చేసే విధంగా స్విగ్గీ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు సర్క్యులేట్ అయ్యాయి. దీనిపై స్విగ్గీ స్పందించింది. అలాంటి ప్రకటనలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఒక వినియోగదారిని X ఖాతాలో Swiggy లోగోతో ఒక ప్రకటన వైరల్ అయింది. “ఎవిక్షన్-సేఫ్ ఫుడ్ డెలివరీ” పేరుతో ప్రజల వ్యక్తిగత అలవాట్లు లీక్ చేయడం అని, ఇలాంటి వాటితో డెలివరీ బాయ్స్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందని అందులో ప్రస్తావించి ఉంది.
ఈ ప్రకటన వైరల్ కావడంతో, స్విగ్గీ బుధవారం X లో ఒక పోస్ట్ విడుదల చేసింది, “ఇటీవల వివాదానికి సంబంధించి మేము ఈ ఉదయం ఒక నకిలీ ప్రకటనను చూశాము. ఇది స్విగ్గి చేసిన ప్రకటన కాదు, అలాగే మా సంస్థతో సంబంధం ఉన్నవారెవరూ కూడా ఇది చేయలేదు అని ప్రకటించింది. అంతేకాదు దాన్ని సర్క్యులేట్ చేసి తమ సంస్థను మర్యాదను పోగొట్టకండి అని రాసుకొచ్చింది. పూర్తి శాఖాహారుల కోసం స్థాపించిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ చాలా మందికి నచ్చింది. ఇకపై నాన్ వెజ్ వచ్చే అవకాశం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.