తెలంగాణ కాంగ్రెస్ నేత సంపత్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి, సంపత్ లేని సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న సంపత్ భార్య మహాలక్ష్మీకి బీపీ పెరిగిపోయింది. సృహ తప్పి పడిపోయింది.
అందరూ కలిసి ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. కానీ తన ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.
రైతుబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ఉన్న దృష్ట్యా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని స్పష్టంచేసింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని తెలిపింది.
తమ దేశంలో పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం(malaysia govt)కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ముఖ్యంగా భారతదేశం, చైనా నుండి పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావడానికి అనుమతించబడ్డారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. సిద్ధార్థనగర్ జిల్లాలో ముస్లిం ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ శ్రీరామ కథలో పాల్గొన్నారు. తర్వాత తరువాత బిజెపీ, హిందూ సంస్థల కార్యకర్తలు శుద్ధి చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది.