తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను త్వరలోనే తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీని ఇటీవల ఆమిర్ కలిశాడట. ఇక మొత్తం 5 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగాన్ని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.