MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నిమ్మకాయల మాలతో కుంకుమార్చన నిర్వహించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.