ప్రకాశం: వినుకొండ మండలం శివపురం దగ్గర ట్రక్-లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందడంపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.