SKLM: నరసన్నపేట మండలం కామేశ్వరి పేట సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఉర్లాం పీహెచ్సీ వైద్యాధికారిణి ఎం శాలిని తెలిపారు. మంగళవారం ఉదయం ఈ శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 48 మందికి వైద్య తనిఖీలు నిర్వహించామని అన్నారు. దీర్ఘకాలిక రోగులకు రక్త, బిపి, మధుమేహ వ్యాధి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామన్నారు.