SRD: పదో తరగతి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు ఈ నెల 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.500, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.1000 చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.