Mandapalli Saneeswaralayam: మందపల్లి శనీశ్వర స్వామి ఆలయాన్ని ఓ భక్తుడు అపవిత్రం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తమండం మందపల్లిలో ఉన్న ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. శనిగ్రహానికి అనువైన ప్రదేశంగా, శనిదేవుని పూజ క్షేత్రం ఇక్కడ క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. లింగంపై నూనెకు బదులుగా పెట్రోల్ పోసాడు. ఆలయ పూజారులు అతన్ని పట్టుకుని నిలదీశారు. బయట అమ్మితే కొన్నానని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆలయ అర్చకులు, అధికారులు లింగంపై పెట్రోలు పోసి స్వామివారికి పూజలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుడికి ప్రత్యేకదేవాలయం ఉంది. కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడట. శని త్రయోదశి, అమావాస్య రోజు పూజలు చేయించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
ప్రచారంలో ఉన్న కథ
మందపల్లి అప్పట్లో పెద్ద అడవి. ఇక్కడ కైటభుడ అనే రాక్షసుడు తన కుమారులైన అశ్వర్థుడు, పిప్పలుడుతో కలసి ఉండేవాడు. ఈ రాక్షసులు తపస్సు చేయడానికి అడవికి వచ్చిన మునులను సంహరిస్తూ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి అగస్త్య మహర్షి తన దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు… రాక్షసుల గురించి చెప్పి కొందరు మునులు తమను రక్షించమని వేడుకున్నారు. అదే సమయంలో గోదావరి తీరంలో తపస్సు చేస్తున్న శనీశ్వరుడి దగ్గరకు తీసుకెళ్లారట అగస్త్య మహర్షి. తాను శివుడి గురించి తపస్సు చేస్తున్నానని..తపస్సు వచ్చిన శక్తితోనే వారిని సంహరించగలనంటాడు శని. అప్పుడు ఆ సన్యాసులందరూ తమ తప:శక్తిని శనీశ్వరునికి సమర్పించడానికి అంగీకరిస్తారు. అప్పుడు శనీశ్వరుడు ఆ రాక్షసులను మారువేషంలో సంహరించాడు. అసుర సంహారం వల్ల జరిగే బ్రాహ్మణ హత్యలను నివారించడానికి మందపల్లిలో లింగాన్ని ప్రతిష్టించి సోమేశ్వర అని పేరు పెట్టాడు. ఈ శివలింగం శనీశ్వరుని ప్రతిష్టించడం వల్ల శనిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.