Rythu Bandhuకు ఈసీ బ్రేక్, మంత్రి హరీశ్‌కు నోటీసులు..?
రైతుబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ఉన్న దృష్ట్యా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని స్పష్టంచేసింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని తెలిపింది.
Rythu Bandhu: ఎన్నికల వేళ రైతుబంధు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. రైతు బంధు (Rythu Bandhu) వద్దని ఓసారి.. అధికార పార్టీ విజ్ఞప్తి చేయడంతో అంగీకరించింది. దీంతో సభలు, సమావేశాల వేదికపై ఆ పార్టీ నేతలు.. ముఖ్యంగా మంత్రి హరీశ్ రావు (Harish Rao) రైతు బంధు గురించి ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపడంతో.. రైతుబంధు నిధులు జమ చేయొద్దని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
వాస్తవానికి ఈ రోజు నిధుల జమ కావాల్సి ఉండే.. సెలవు ఉండటంతో రేపు జమ చేస్తామని ప్రకటించారు. ఇంతలో ఈసీ డబ్బులు వేయొద్దని స్పష్టం చేయడంతో అధికార పార్టీకి మైనస్ అవనుంది. ఇటీవల ఓ సభ వేదికపై మంత్రి హరీశ్ రావు (Harish Rao) మాట్లాడారు. మీకు సోమవారం ఉదయం 10 గంటల వరకు మొబైల్ టంగ్ టంగ్ టంగ్ అని డబ్బులు జమ అయ్యినట్టు మేసెజ్ వస్తోందని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
మంత్రి హరీశ్ రావుపై (Harish Rao) ఈసీ (ec) మండిపడింది. ఈ మేరకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల్లో లబ్ది పొందేలా మాట్లాడొద్దని ముందే సూచించాం. హరీశ్ రావు (Harish Rao) మాత్రం పోలింగ్‌కు ముందు ఫలానా తేదీ, సమయానికి రైతు బంధు పడుతుందని చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది. దీంతో ఆయనపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఆ నోటీసుల్లో పేర్కొంది.