EC shock to KCR... 48 hours ban on election campaign
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంపై సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిషేధం విధించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నేటికి 7వ రోజు ఆయన బస్సు యాత్రను దిగ్విజయంగా కొనసాగుంది. తాజా ఈసీ నిర్ణయంతో బస్సుయాత్రకు బ్రేక్ పడింది. దీనికి కారణం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అని ఈసీ ప్రకటనలో పేర్కొంది.
ఎన్నికల వేళా సిరిసిల్లా జిల్లాలో కేసీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రసంగించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ విరుచుకపడ్డారు. వారిపై పలు ఆరోపణలు చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిటిషన్‌పై విచారణ జరిపిన ఈసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రాబోవు 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది.