»Prime Minister Modi And Amit Shah Resented Me Cm Revanth Reddy
CM Revanth Reddy: ప్రధాని మోడీ, అమిత్ షా నన్ను పగబట్టారు.
బీజేపీ బెదిరిస్తే భయపడుతానా.. తన వెంట నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఎలా తీసేస్తారు అని అడిగినందుకు మోడీ, అమిత్ షాలు పగబట్టి ఢిల్లీ నుంచి నోటీసులు పంపించారని పేర్కొన్నారు.
Prime Minister Modi and Amit Shah resented me.. CM Revanth Reddy
CM Revanth Reddy: రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకు తనపై ప్రధాని మోడీ, అమిత్ షా పగబట్టారని, అందుకే ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించి నోటీసులు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లలో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. ప్రజల అండతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గుజరాత్ నుంచి మోడీ రాష్ట్ర సీఎంను భయపెట్టాలని చూస్తున్నాడని, ఆయన దగ్గర ఈడీ, సీబీఐ ఉండొచ్చు కానీ తన దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజల బలం ఉందని వ్యాఖ్యానించారు.
బలహీన వర్గాలకు దక్కాల్సిన నిధులు ఇంకా అందలేదన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. ఈ ఎన్నిలు భిన్నమైనవి అని తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేస్తున్నాయని.. 400 సీట్లు గెలిస్తే ఈ దేశాన్నే అమ్మేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలన్నారు. ఇదే విషయాన్ని ఆయన ప్రశ్నించినందుకు పోలీసులతో నోటీసులు ఇప్పించారు అని పేర్కొన్నారు. మోడీ ఇచ్చిన హామీలు ఏం లేవు అని ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.