వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను ఏఎస్ఐ సోమవారం జిల్లా జడ్జి కోర్టులో సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి నివేదికను సీల్డ్ కవరులో దాఖలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో ఒక్కో చోట తమ పార్టీ పోటీ చేయనుందని వివరించారు.
ఆరోగ్య కింద రూ.25 లక్షల వైద్యం అందించనున్నట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వైద్యం కోసం ప్రతి ఒక్కరూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇకపై రాకూడదని అన్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానులు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇరువురి అభిమానులపై కేసులు నమోదు చేశారు.
క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. అలాగే మెక్సికో సిటీలో జరిగిన ఘర్షణ వల్ల 11 మంది ప్రాణాలు విడిచారు.
తగ్గిపోయాయని అనుకున్న కరోనా కేసులు మళ్లీ పడగవిప్పుతున్నాయి. తాజాగా కరోనా వల్ల ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కరోనాతో నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు.
అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.
యువగళం పాదయాత్రలో నారాలోకేశ్ చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఐస్ క్యూబ్స్‌తో ఆయన తన చేతిని మర్దన చేసుకుంటున్నారు. చేతికి గాయం అయినప్పటికీ ఆయన పాదయాత్రను కొనసాగించారు.