»Firing On People Coming From Christmas Party 16 People Killed
Viral: క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై కాల్పులు..16 మంది మృతి
క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. అలాగే మెక్సికో సిటీలో జరిగిన ఘర్షణ వల్ల 11 మంది ప్రాణాలు విడిచారు.
మెక్సికోలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. తాజాగా జరిగిన కాల్పుల ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మెక్సికోలోని గువానాజువాటో రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది. సాల్వాటియెర్రా పట్టణంలో క్రిస్మస్ సీజన్ పార్టీ నుంచి ఇళ్లకు తిరిగి వస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
క్రిస్మస్ పండగ నేపథ్యంలో ‘పోసాడా’ అని పిలిచే క్రిస్మస్ పార్టీని అక్కడి జనాలు జరుపుకుంటూ ఉంటారు. ఓ ఈవెంట్ హాల్లో జనాలు పార్టీ నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు చేపట్టాడు. సలామాంకా నగరంలో కూడా మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు.
మరోవైపు మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీలో ఉన్న టెక్స్కల్టిట్టాన్ గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాయుధులు, క్రిమినల్ గ్యాంగులకు మధ్య ఘర్షణలు జరగడంతో ఆ ఘటనలో 11 మంది ప్రాణాలు విడిచారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.