ఓ విమానం టేకాఫ్ అవడం లేటైందని ఓ ప్రయాణికుడు ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు వెళ్లాడు. తరువాత గాల్లో ఎగిరే సమయానికి అదే డోర్ ద్వారా లోపలికి వచ్చాడు. దీనింతటికి తోటి ప్రయాణికులు కూడా మద్దతు ఇచ్చారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే అసలు విషయం చెప్పేశాడు.
Mexico flight delayed take off.. Passenger who opened emergency door
Viral News: గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానం నుంచి అత్యవసర తలుపును తీసుకొని ఓ వ్యక్తి విమానం రెక్క గుండా బయటకు వచ్చాడు. కాసేపటికి విమానం టేకాఫ్ అయే సమయానికి తిరిగి సదరు ప్యాసింజర్ ఫ్లైట్‌లోకి వచ్చాడు. దీనింతటికి తోటి ప్రయాణికులు అతని సాయం చేయడం కొసమెరుపు. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణులనున కూడా విచారించారు. వారు చెప్పిన సమాధానం విని సిబ్బంది షాక్ అయ్యారు.
ఏరోమెక్సికో(Aeromexico)కు చెందిన ఏఎమ్ 672 అనే విమానం గ్వాటెమాలకు ఉదయం 8.45 గంటలకు బయలు దేరాల్సి ఉంది. అయితే అనుకోని అంతరాయం వలన 4 గంటల సమయం టేకాఫ్ అవకుండా రన్‌వే పైనే ఉంది. ప్యాసింజర్లు కూడా అందులో ఉన్నారు. దీంతో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి గాలి కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్దంగా ఉందని తెలసి తిరిగి వచ్చాడు. దీనికి తోటి ప్రయాణికులు అతని సాయం చేశారు. నాలుగు గంటల పాటు ఊపిరి ఆడలేదని ప్రయాణికులు చెప్పడంతో సిబ్బంది సైలెంట్ అయ్యారు. దీనిపై ఏరోమెక్సికో స్పందించలేదు. దీంతో ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.