Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సినాలోవా రాష్ట్రంలో నిన్న ఓ ట్రక్కు, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే మంటలు అంటుకోవడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.