ఏపీ సీఎం వైఎస్ జగన్పై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో ఒక్కో చోట తమ పార్టీ పోటీ చేయనుందని వివరించారు.
CPI Narayana: ఏపీ సీఎం వైఎస్ జగన్పై సీపీఐ నారాయణ (CPI Narayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో ఒక్కో చోట తమ పార్టీ పోటీ చేయనుందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం సీసీఐతో పొత్తు పెట్టుకోవడమేనని తెలిపారు.
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణం.. ఒంటెద్దు పోకడ అని తెలిపారు. తెలంగాణలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల ఆ పార్టీ గెలిచిందని చెప్పారు. ఇండియా కూటమి ఎంత అవసరమో.. కూటమిలోని పక్షాలను కలుపుకొని పోవడం అంతే అవసరం అని తెలిపారు. పాస్ బుక్లో సీఎం జగన్ (Jagan) ఫోటోలు ఎందుకు అని నారాయణ అడిగారు. ప్రతీ ఊరిలో జగన్ సమాధి రాయి వేసుకున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో సీఎం జగన్పై వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. తెలుగు ప్రజలకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఆ పార్టీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని మండిపడ్డారు.