జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘాట్లు, వీఐపీ ఘాట్లు, తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై
WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి 9959226289కు ఫోన్ చేయవచ్చన
KNR: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు తొంగిచూస్తాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జరిగిన తమ్మనవేణి మల్లమ్మ, పుట్ట స్వరూప, పుత్లీ బేగం
MBNR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంగళవారం విజేతలను జిల్లా ఎస్పీ డి. జానకి అభినందించారు. అలాగే వారికి ప్రశంసాపత్రాల
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడం అమానుషమని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయ
CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన DMAC రెండవ కమిటీ సమావేశం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చ
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భూ సేకరణ సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఆస్
MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. నిర్వాసితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. గజం ప్రభుత్వ విలువ రూ.5,000 ఉండగా కేవలం రూ. 600 చొప్పున పరిహారం ఇవ్వడంపై కలెక్టర్ రాహుల
NZB: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన గ్రామాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి సూచించారు. ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన వర్ని మండల కేంద