• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీజేలు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ

కోనసీమ: అంబేడ్కర్ జయంతి సందర్భంగా SP రాహుల్ మీనా ఆదేశాలతో ఆలమూరు పరిధిలోని నర్సిపూడిలో సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని CI విద్యాసాగర్ సూచించారు. ఫ్లెక్సీలు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 14, 2026 / 08:18 AM IST

‘రిస్క్ మ్యాపింగ్ చేసి, నివేదిక అందించాలి’

ASR: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పిల్లలు చనిపోవడాలు నివారించేందుకు కలెక్టర్ నిశాంతి సోమవారం కఠిన ఆదేశాలు జారీచేశారు. ప్రమాదకర కాలువలు, చెరువులు, జలపాతాలను గుర్తించి, రిస్క్ మ్యాపింగ్ చేసి శుక్రవారంలోగా ఐటీడీఏకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, వెదురు కంచెలు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

April 14, 2026 / 08:06 AM IST

ఆటో డ్రైవర్‌ను అభినందించిన సీఐ

CTR: ఆటోలో మర్చిపోయిన సెల్ ఫోన్ తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌ను సీఐ సోమశేఖర్ రెడ్డి అభినందించారు. పట్రపల్లెకు చెందిన యాస్మి వీకోట మార్కెట్ యార్డ్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు గోవింద్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆటోలో ప్రయాణం చేసింది. ఆటో దిగే సమయంలో అందులో సెల్ ఫోన్ మర్చిపోయింది. దానిని గుర్తించిన అతడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.

April 14, 2026 / 08:03 AM IST

నేడు సంతమాగులూరుకు మంత్రి గొట్టిపాటి రాక

BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ఇవాళ సంతమాగులూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సంతమాగులూరులో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం నెహ్రూనగర్‌లో నూతన బీటీ రోడ్డును, అలాగే ‘పి.ఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (ఉచిత సోలార్ విద్యుత్) పథకాన్ని ప్రారంభించనున్నారు.

April 14, 2026 / 08:00 AM IST

వ్యక్తిని ఢీకొన్న లారీ.. రెండు కాళ్లు నుజ్జు నుజ్జు

PLD: క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన తోకల లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి . గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఫంక్షన్‌కి వెళ్లి వస్తూ సత్తెనపల్లి మండలం నందిగం సమీపంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

April 14, 2026 / 08:00 AM IST

‘శ్రీరాముడు విగ్రహం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా బాధకారం’

VZM: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని రామతీర్థం కోదండ రాముడి ఆలయంలో శ్రీరాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన యావత్ దేశవ్యాప్తంగా కలిచి వేసిందని రాష్ట్ర ఎం.ఎస్.ఎం. ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముడు విగ్రహంతో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలను కోటిపల్లి గోదావరి తీరంలో నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

April 14, 2026 / 08:00 AM IST

‘డ్రగ్స్ వాడకం జాతీయ భద్రతకు ముప్పు’

GNTR: వడ్లమూడి వర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహనకు ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏపీ ఈగల్ ఐజీపీ రవికృష్ణ సోమవారం పాల్గొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని ఆయన హెచ్చరించారు. వీటికి పెట్టే ఖర్చు ఉగ్రవాదులకు చేరుతోందన్నారు. నార్కో టెర్రరిజంపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 14, 2026 / 08:00 AM IST

దారుణం.. చిన్నారిపై వృద్ధుడి అకృత్యం

ATP: కళ్యాణదుర్గం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన తమ్మప్ప(65) అనే వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో నిందితుడు చిన్నారులను టీవీ చూసేందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అకృత్యానికి పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

April 14, 2026 / 07:53 AM IST

‘ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు’

KDP: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు హెచ్చరించారు. సోమవారం సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె పంచాయతీ నిర్మలగిరి కాలనీలో సుమారు 3.50 ఎకరాల భూమిని ఆక్రమించారన్న సమాచారంతో MRO ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

April 14, 2026 / 07:51 AM IST

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: CITU

W.G: భీమవరం UTF కార్యాలయంలో సోమవారం CITU అనుబంధ శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సు జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వాలు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జిల్లా కన్వీనర్ కళ్యాణి ప్రశ్నించారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు, ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నేత చింతపల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 07:51 AM IST

ప్రజలకు మధ్య ఉండేవారే పేరా లీగల్ వాలంటీర్స్

VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వులు మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్యారా లీగల్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారే పేరా లీగల్ వాలంటీర్స్ అని అన్నారు.

April 14, 2026 / 07:46 AM IST

‘వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి’

AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సబ్బవరం మండలం గొటివాడలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పి. సురేష్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు.

April 14, 2026 / 07:42 AM IST

పూతలపట్టులో విజిలెన్స్ దాడులు

CTR: పూతలపట్టులో తిరుపతి ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గృహ ఉపయోగాలకు ఉపయోగించే 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనధికారంగా గ్యాస్ సిలిండర్ల నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

April 14, 2026 / 07:37 AM IST

భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

EG: ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో, ఏర్పాట్లన్నీ పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.

April 14, 2026 / 07:36 AM IST

‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

VSP: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సోమలింగం పాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాయిబాబా, స్కూల్ కమిటీ ఛైర్మన్ నాగ విశ్వేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు. జడ్పీ హైస్కూల్ పరిధిలో వారు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు.

April 14, 2026 / 07:36 AM IST