• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసులో నిందితుడికి శిక్ష

అనకాపల్లి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 4 ఏళ్ల 9 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ విశాఖ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 2021లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆకాశ్ పాండురంగన్ (A3)పై నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైనట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.

April 16, 2026 / 08:06 AM IST

‘టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి’

E.G: బివిఎమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో గత 9 రోజులుగా జరిగిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని డీఈవో కంది వాసుదేవరావు బుధవారం తెలిపారు. 7 జిల్లాల నుంచి 7 సబ్జెక్టులకు సంబంధించిన 1,76,032 పత్రాలు వచ్చాయి. 780 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. ఇందులో 75 చీఫ్ ఎగ్జామినర్లు, 455 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 221 సహాయకులు విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.

April 16, 2026 / 08:00 AM IST

‘లోకేష్ నియామకం పార్టీకి వెయ్యి ఏనుగుల బలం’

కోనసీమ: రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్ బాబుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం టీడీపీ కేడర్‌లో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపడమేనని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,  మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం రాత్రి అన్నారు. లోకేష్‌కు పార్టీలో నూతన బాధ్యత అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు అభినందనలు తెలియజేశారు.

April 16, 2026 / 08:00 AM IST

రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 16, 2026 / 07:57 AM IST

పీజీఆర్‌ఎస్‌ వేళల్లో మార్పు: కలెక్టర్

ATP: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వేళల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు ఈ నెల 20 నుంచి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఉ.8 నుంచి11 వరకు అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లోనూ ఇదే సమయం వర్తిస్తుందని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు.

April 16, 2026 / 07:53 AM IST

రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన కన్నబాబు

ELR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కె. కన్నబాబు ఏలూరు (D)లో పర్యటించారు. భీమడోలు (M) సూరప్పగూడెంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి సేవలపై ఆరా తీశారు. అనంతరం పాతూరులోని చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు.

April 16, 2026 / 07:52 AM IST

‘విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నాం’

NDL: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షౌరాణ్ బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పద వాహనాలు, నిషేధిత వస్తువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం గురించి వివరించారు.

April 16, 2026 / 07:51 AM IST

మడకశిర విద్యుత్ డీఈఈ రఘు సస్పెన్షన్

సత్యసాయి: అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మడకశిర సబ్ డివిజన్ విద్యుత్ డీఈఈ రఘును సస్పెండ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనల అతిక్రమణ, రైతులకు సామగ్రి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, అనధికారికంగా విద్యుత్ లైన్లు మార్చడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. వీటిపై విచారణ జరిపించిన అధికారులు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. 

April 16, 2026 / 07:48 AM IST

భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు కృషి: కలెక్టర్

మన్యం: జిల్లాలోని నీటి వనరులను శాశ్వత ప్రాతిపాదికన సంరక్షించేందుకు, భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు అత్యధిక సాకేంతికతో కూడిన మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ప్రధాన కార్యదర్శికి వివరించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రీ సర్వే, జలధార తదితర అంశాలపై కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

April 16, 2026 / 07:43 AM IST

టీడీపీ నేతకు నివాళులర్పించిన అధ్యక్షురాలు

KRNL: ఆదోని (M) బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోయ రాముడు అకాల మరణంతో బుధవారం గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గ్రామానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రాముడు చేసిన పార్టీ సేవలు అమూల్యమని ఆమె పేర్కొన్నారు.

April 16, 2026 / 07:40 AM IST

కర్ణాటక భక్తుల మృతి బాధాకరం: ఎమ్మెల్యే

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సేవలు అందేలా చూడాలని పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

April 16, 2026 / 07:38 AM IST

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఎస్సై నరేశ్

CTR: శాంతిపురం మండలంలో ఎలాంటి సమస్యలైనా 112 కాల్ చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళల అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్ సమస్యలు, దొంగతనం, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి సమస్యలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 112కి కాల్ చేసి తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

April 16, 2026 / 07:32 AM IST

టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా సుజయ్ కృష్ణ రంగారావు

విజయనగరం: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికయ్యారు. టీడీపీలో చురుకైనా పాత్ర పోషించడంతో జోనల్ కో-ఆర్డినేటర్‌గా అధిష్ఠానం నియమించింది. సుజయ్ కృష్ణ రంగారావుకు పదవి రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుజయ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు.

April 16, 2026 / 07:31 AM IST

‘సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి’

E.G: నిడదవోలులో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, APSSDC ఛైర్మెన్ బూరుగుపల్లి శేషారావు బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

April 16, 2026 / 07:31 AM IST

పోలీసులను ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఇక సహించబోమని వైసీపీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధ ప్రచారాలను వెంటనే అరికట్టాలని వారు ఎస్పీని కోరినట్లు తెలిపారు.

April 16, 2026 / 07:27 AM IST