• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది: ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన టీడీపీ నాయకుడు లడ్డు ఇస్మాయిల్ భౌతికకాయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ఆయన మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

April 21, 2026 / 06:50 PM IST

రాయచోటిలో ACB దాడులు

అన్నమయ్య: కదిరి బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీపై ACB సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నగదు, బంగారం, ఇళ్లు, స్థలాలు, వాహనాలు సహా కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని కర్నూలులోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

April 21, 2026 / 06:50 PM IST

వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వెలుగు సిబ్బందికి 5జీ స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యదిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చన్నారు.

April 21, 2026 / 06:48 PM IST

జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ మోసం

విశాఖపట్నంలో జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వాట్సాప్ ఖాతాలతో అధికారులు, ప్రజలకు మెసేజ్‌లు పంపుతూ అత్యవసరమని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలకు స్పందించవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరించారు.

April 21, 2026 / 06:43 PM IST

ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలి: కలెక్టర్

CTR: జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జల జీవన్ మిషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత పలు అంశాలపై దిశ నిర్దేశం చేసి తగు సూచనలు ఇచ్చారు.

April 21, 2026 / 06:41 PM IST

బాధితురాలికి సీఎం సహాయనిధి అందజేత

PLD: యడ్లపాడుకు చెందిన షేక్ శంషాద్‌బీకి సీఎం సహాయనిధి నుంచి రూ.1,03,447 మంజూరయ్యాయి. మంగళవారం ఈ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల వైద్యానికి కూటమి సర్కారు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలిపారు.

April 21, 2026 / 06:39 PM IST

మచిలీపట్నంలో కిసాన్ గోష్టి కార్యక్రమం

కృష్ణా: రైతులకు అవగాహన పెంపొందించేందుకు కిసాన్ గోష్టి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఎన్. రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటవ్వగా, వరి, మినుము పంటలపై చర్చలు జరిగాయి.

April 21, 2026 / 06:38 PM IST

సీతంపేటలో జలజీవన్ మిషన్‌కి శ్రీకారం

SKLM: వజ్రపుకొత్తూరు మండలం సీతంపేటలో జల జీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు పనులను ప్రారంభించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఇందులో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పాల్గొన్నారు.

April 21, 2026 / 06:33 PM IST

మిస్సింగ్ బాలుని కనుగొన్న ఎస్సై

BPT: పిట్టలవానిపాలెం మండలంలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి మద్రాస్ రైలు ఎక్కిన నాగసాయి అనే బాలుడిని చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ గంటల వ్యవధిలో క్షేమంగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెన్నైలో ఉన్న బాలుడిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

April 21, 2026 / 06:32 PM IST

‘జొన్నగిరి గోల్డ్ మైన్స్ భూసేకరణ వేగవంతం చేయాలి’

KRNL: తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్స్ సంబంధిత పెండింగ్ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ మైన్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఉత్పత్తి ప్రక్రియ మొత్తం విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

April 21, 2026 / 06:30 PM IST

స్వామివారి ఆభరణాలు రికవరీ చేయాలని ఫిర్యాదు

KDP: పొద్దుటూరు శివాలయంలో జరిగిన దొంగతనంపై ఇవాళ జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి 2టౌన్ సీఐ వంశీనాథ్‌కు ఫిర్యాదు చేశారు. శివాలయంలో స్వామివారికి చెందిన వెండి ఆభరణాలు మాయమయ్యాయని, అమ్మవారి బంగారు హారం స్థానంలో నకిలి హారాన్ని ఉంచారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, మాయమైన ఆభరణాలను రికవరీ చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

April 21, 2026 / 06:30 PM IST

విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ

ATP: గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ హోమియో డాక్టర్ తిరుపతి నాయుడు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. కనీసం రోజుకు 3-4 లీటర్ల నీరుని తీసుకోవాలన్నారు. వదులుగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించాలన్నారు. పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు హోమియో మందులను అందజేశారు.

April 21, 2026 / 06:30 PM IST

టీడీపీలో చేరిన మాజీ వైస్‌ ఛైర్మన్‌

PLD: చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, వైసీపీ నేత షేక్ అబ్దుల్లా టీడీపీలో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అబ్దుల్లా చేరికతో పట్టణంలో పార్టీ బలపడుతుందని ప్రత్తిపాటి అన్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఆకర్షితుడనై తాను పార్టీ మారానని అబ్దుల్లా తెలిపారు.

April 21, 2026 / 06:25 PM IST

దుద్దుకూరులో సాయిబాబా వార్షికోత్సవ వేడుకలు

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో శ్రీ షిరిడి 18వ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ముళ్లపూడి గంగాధరం దంపతులు ప్రత్యేక పూజలు జరిపించి గ్రామపుర వీధుల్లో ఊరేగింపు జరిగించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో బాబాకు పువ్వులు, ధాన్యం, పలహారాలు అందించారు.

April 21, 2026 / 06:20 PM IST

‘ప్రజల అవసరాలు మేరకు అభివృద్ధి పనులు’

E.G: రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు పరిధిలోని జంగాల కాలనీ నుంచి కళ్యాణ నగర్ వరకు రుడా నిధులు రూ. 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు రూరల్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారు.

April 21, 2026 / 06:20 PM IST