• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సరస్వతి పాఠశాలకు భారీ విరాళం

ATP: పామిడి సరస్వతి విద్యా మందిరం అభివృద్ధికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నూతన గదుల నిర్మాణం, ఇతర మరమ్మతుల కోసం తన సొంత నిధులు రూ.50 వేలు విద్యా మందిరం బృందానికి అందజేసి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించింది.

April 11, 2026 / 03:00 PM IST

జిల్లాలో వేప చెట్లకు ఎందుతెగులు

W.G: జిల్లాలో వేప చెట్లకు ఎందుతెగులు భారీగా వ్యాపించింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 80 శాతం చెట్లు ఈ వ్యాధి బారిన పడి వేప చెట్లు ఎండిపోతున్నాయి. ప్రతీ ఇంటి వద్ద వేప ఆకులతో సహా నిర్జీవంగా కనిపిస్తోంది. దీనిపై ఉద్యాన విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. గాల్ అనే వైరస్ సోకడంతో ఇలా జరుగుతుందని వివరించారు.

April 11, 2026 / 03:00 PM IST

రాయచోటిలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ వెలుగులు

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో తొలి దశలో 2,784 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు కాగా, రూ.33.40 కోట్లతో ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబన పెరుగుతుంది.

April 11, 2026 / 03:00 PM IST

భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VZM: భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఇవాళ సందర్శించారు. మన జిల్లాలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయంను చూసి పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారని ఆమె తెలిపారు.

April 11, 2026 / 02:58 PM IST

బాపట్లలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించేందుకు త్వరలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడుతుందని, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

April 11, 2026 / 02:56 PM IST

రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆలమూరు మండలం పెనికేరు ఎస్సీ వాడలో పునర్నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయం శనివారం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని గ్రామస్థుల సహకారంతో పునర్నిర్మించారు. టీడీపీ నాయకుడు ఈదర చిన్నబాబు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించగా… కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు.

April 11, 2026 / 02:50 PM IST

కొండపల్లిలో ఘనంగా పూలే జయంతి

NTR: కొండపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు హాజరై పూలే, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భావితరాలకు మార్గదర్శి అయిన పూలే చూపిన వెలుగుబాటలో మనమంతా పయనిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

April 11, 2026 / 02:45 PM IST

‘గర్భస్థ దశలోనే పోషకాహారం తీసుకోవాలి’

W.G: మహిళలు గర్భస్థ దశ నుంచే పోషక ఆహారం తీసుకోవాలని మాధవరం పీహెచ్సీ డాక్టర్ సింధు సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం(M) మెట్ట ఉప్పరగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో కూడిన విద్య అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తారన్నారు. చిన్నారులకు త్వరితగతిన విషయాలు అర్థమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

April 11, 2026 / 02:41 PM IST

నారాయణ స్వామి మృతికి కేతిరెడ్డి నివాళి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని కోటకు చెందిన వైసీపీ కార్యకర్త మహేష్ తండ్రి ఎం.నారాయణ స్వామి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 11, 2026 / 02:30 PM IST

మహాత్మా జ్యోతిరావు పూలేకు టీటీపీ నాయకుల నివాళులు

KRNL: ఎమ్మిగనూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 11, 2026 / 02:30 PM IST

దోమతెరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజలకు దోమతెరలను అందజేశారు. మలేరియా, డెంగ్యూ నివారణలో దోమతెరల వినియోగం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 11, 2026 / 02:25 PM IST

ఘనంగా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు

విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలు, వితంతువులు, అణగారిన వర్గాల్లో హరించబడిన మానవ హక్కులు కొరకు పూలే పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

April 11, 2026 / 02:20 PM IST

‘రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం’

BPT: చీరాల రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు రెడ్ క్రాస్ ఛైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. శనివారం స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు అనంతరం కొంతకాలం సేవా కార్యక్రమాలలో జాప్యం ఏర్పడినప్పటికీ, నూతన కార్యవర్గం ఏర్పాటుతో తిరిగి సేవలను యథావిధిగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

April 11, 2026 / 02:15 PM IST

ఒకే సారి మూడు వాహనాలు ఢీ.. తప్పిన ప్రమాదం

TPT: పెళ్లకూరు వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ డౌన్ కావడంతో DCM రోడ్డు పక్కన ఆగింది. ఈ క్రమంలో నాయుడుపేట వైపు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. వెంటనే కారు వెనుక వస్తున్న మరో వాహానం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

April 11, 2026 / 02:14 PM IST

జిల్లాలో పర్యటించనున్న మంత్రి

మార్కాపురం: జిల్లాలో ఇవాళ మంత్రి గోట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పెద్ద యాచవరంలో సా. 4 గంటలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత హాజరుకానున్నారు. గ్రామంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

April 11, 2026 / 02:14 PM IST