• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

VZM: అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నివారణకు సహకరించాలని కోరారు. బెట్టింగులు వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.

April 12, 2026 / 07:00 PM IST

రుషికొండలో స్కూటీకి మంటలు.. పూర్తిగా దగ్ధం

VSP: రుషికొండ బీచ్ రోడ్డుపై ఆదివారం ప్రయాణిస్తున్న స్కూటీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాహనం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పక్కకు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి స్కూటీ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

April 12, 2026 / 07:00 PM IST

‘దళిత గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి’

PPM: దళిత గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఉత్తరాంధ్ర దళిత జేఏసీ మెంబర్ పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై, అట్రాసిటీ యాక్ట్‌పై పార్వతీపురం పట్టణంలోని గిరిజన భవన్లో సెమినర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి. చిట్టిబాబు పాల్గొని, అవగాహన కల్పించారు.

April 12, 2026 / 07:00 PM IST

రామదాసుపురంలో తీరిన విద్యుత్ కష్టాలు

SKLM: పొందూరు(M) రామదాసుపురంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ జోక్యం చేసుకోవడంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. గ్రామంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్, 8 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ఆదివారం పూర్తయ్యాయి. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

April 12, 2026 / 07:00 PM IST

‘అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

KRNL: ఆలూరులో నిర్మాణ దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ సందర్శించారు. భవన నిర్మాణ నాణ్యతతో పాటు వంటగది, భోజనశాల సౌకర్యాలను పరిశీలించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్ ఆలూరు ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.

April 12, 2026 / 06:44 PM IST

హెల్మెట్‌పై ట్రాఫిక్ సీఐ సూచనలు

NTR: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ సూచించారు. విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ప్రాణ రక్షణకు ముఖ్యమని తెలిపారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

April 12, 2026 / 06:44 PM IST

‘బెట్టింగ్‌లో పాల్గొంటే భవిష్యత్తు నశనమవుతుంది’

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ క్రికెట్ బెట్టింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఐపీఎల్ సీజన్‌లో సరదాగా మొదలయ్యే బెట్టింగ్ వ్యసనంగా మారి యువతను అప్పులు, నేరాల వైపు నెడుతుందని హెచ్చరించారు. సెల్‌ఫోన్ల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదై భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేశారు.

April 12, 2026 / 06:42 PM IST

254 మందికి ఉచిత వైద్య పరీక్షలు

BPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేమూరు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 254 మందికి పరీక్షలు నిర్వహించారు. సాల్వేషణ్ ఆర్మీ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు.

April 12, 2026 / 06:36 PM IST

రోడ్డు వేయండి సారు.!

ప్రకాశం: కొండపి (M) కే.ఉప్పలపాడు నుంచి నిడమనూరు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఒళ్ళు గుల్లవుతుందని స్థానికులు అంటున్నారు. కే.ఉప్పలపాడు నుంచి టంగుటూరు మండలానికి కలిపే ఈ రోడ్డు నాలుగు కిలోమీటర్లు మేరా అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి అని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.

April 12, 2026 / 06:34 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

NDL: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేర చరిత్ర కలిగిన వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవన్నారు.

April 12, 2026 / 06:34 PM IST

ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కృష్ణా: ఈ నెల 13న సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో 10:30 గంటల నుంచి ‘మీకోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)’ కార్యక్రమం ఉందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, తద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

April 12, 2026 / 06:34 PM IST

’12వ పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించాలి’

KRNL: 12వ పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీయూ ఆదోని, కౌతాళం మండలాల శాఖల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదోని STU భవన్‌లో నిర్వహించారు. 11వ పీఆర్‌సీ కాలం ముగియనున్నప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. 30% మధ్యంతర భత్యం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

April 12, 2026 / 06:34 PM IST

వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించిన ZPTC

KDP: చక్రాయపేట మండలంలోని శ్రీగండి వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను జెడ్పీటీసీ శివ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రూ.25 లక్షల జెడ్పీ నిధులతో నిర్మిస్తున్నామని, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

April 12, 2026 / 06:32 PM IST

సమాచార కమిషనర్‌ను కలిసిన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్

రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడును డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశ అంశాలను వివరించారు. న్యాయసేవల మెరుగుదల, కేసుల వేగవంత పరిష్కారం, పనితీరు నాణ్యతపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ హమీద్, పీ.పీ.ఎస్. రాంమూర్తి నాయుడు, ఏజీపీ కన్నూరు అప్పలనాయుడు పాల్గొన్నారు.

April 12, 2026 / 06:31 PM IST

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు UPDATE

కోనసీమ: ముమ్మిడివరం పదో మైలురాయి సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. అతను కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన పెట్టా బాబిగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళుతూ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా బాబి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

April 12, 2026 / 06:31 PM IST