• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పాలీసెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి’

KDP: వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా పాలీసెట్ హాల్ టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి డౌన్‌లో‌డ్ చేసుకోవచ్చని ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి తెలిపారు. పాలీసెట్ పరీక్ష ఈనెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారన్నారు. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని అభ్యర్థులు పరిశీలించుకోవాలన్నారు.

April 18, 2026 / 02:40 PM IST

జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

SKLM: పొందూరు మండలం లోలుగుకి చెందిన జనసేన కార్యకర్త వెంకటస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా అధ్యక్షుడు పి .చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్ రావు ఇవాళ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. జన సైనికుల సహకారంతో సేకరించిన రూ. 40 వేల ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 18, 2026 / 02:38 PM IST

చుండూరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

BPT: చుండూరు మండలంలోని చుండూరు గ్రామంలో ఉన్న డా. బీ.ఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. కార్యక్రమం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

April 18, 2026 / 02:35 PM IST

పైపులైన్ ద్వారా గోదావరి జలాల పంపిణీ: ఎమ్మెల్యే

ELR: సమాజంలో సంపూర్ణమైన మార్పునకు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. త్వరలో రూ. 230 కోట్లతో పైపులైన్ ద్వారా గోదావరి జలాలను ఏలూరు నగర ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

April 18, 2026 / 02:33 PM IST

ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2015-16 నుంచి 2018-19 మధ్య స్వయం ఉపాధి రుణాలు పొందిన వారు ఈ నెల 30లోపు అసలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేస్తామని ఈడీ దుర్గాబాయి తెలిపారు. గడువు దాటితే అసలుతో పాటు వడ్డీ కట్టాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

April 18, 2026 / 02:30 PM IST

సి.బెళగల్లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

KRNL: సి.బెళగల్లో ఎంపీడీవో కార్యాలయం ఎదుట డిప్యూటీ ఎంపీడీవో మహేశ్వరి ఆధ్వర్యంలో ఇవాళ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ‘వాటర్ పాజిటివ్ ఆంధ్ర’ లక్ష్యాలతో వర్షపు నీటి సంగ్రహణ, చెరువులు-కుంటల శుభ్రత, గ్రే వాటర్ నిర్వహణ, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 18, 2026 / 02:30 PM IST

ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

PLD: నరసరావుపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించిన ఈ పర్యవేక్షణలో ఆసుపత్రి పనితీరు, వైద్య సేవల నాణ్యతను పరిశీలించారు. డాక్టర్ల హాజరు, మందుల లభ్యత, రోగులకు అందుతున్న చికిత్స వివరాలను ఎమ్మెల్యే నేరుగా తెలుసుకున్నారు.

April 18, 2026 / 02:30 PM IST

ఇసుక తరలిస్తున్న లారీలు స్వాధీనం

NTR: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను వీరులపాడు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ లారీలు ఒక ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీకి చెందినవిగా గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 18, 2026 / 02:30 PM IST

వీవోఏలకు నూతన మొబైల్ ఫోన్లు పంపిణీ

కృష్ణా: వీవోఏలు ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం చల్లపల్లిలోని వెలుగు కార్యాలయంలో మండలంలోని 37మంది వీవోఏలకు నూతన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి ఫోన్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

April 18, 2026 / 02:26 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మల్లెల రాజశేఖర్

NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇవాళ టీటీడీ బోర్డు సభ్యుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు మర్యాదలతో వారికి స్వాగతం పలికి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు.

April 18, 2026 / 02:20 PM IST

‘భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి’

PPM: పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, మ్యుటేషన్లు, రీ-సర్వే ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సర్వేయర్లను ఆదేశించారు. ఎక్కడా గడువు మించకుండా పారదర్శకంగా పనులు జరగాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జేసీ యశ్వంత్ కుమార్ ఇవాళ డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు.

April 18, 2026 / 02:19 PM IST

‘పశుసంవర్ధక రంగ అభివృద్ధి మా లక్ష్యం’

SKLM: పోలాకి మండలం గొల్లల వలసలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం అధికారులు నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. లేగ దూడలను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు.

April 18, 2026 / 02:12 PM IST

స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిజ్ఞ

PLD: సత్తెనపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తారకరామ సాగర్‌లో పూడికతీత పనులు ప్రారంభించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసి, పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా కల్పిస్తుందన్నారు. చెరువులు బాగుచేసి భూగర్భ జలాలు పెంచాలన్నారు.

April 18, 2026 / 02:12 PM IST

సింగపూర్ పర్యటనకు జిల్లా మంత్రులు

ATP: రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ సహా తొమ్మిది మంది మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు వీరు అక్కడ ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కఠినమైన షెడ్యూల్‌తో ఈ శిక్షణ సాగనుంది.

April 18, 2026 / 02:11 PM IST

పాడేరులో మెగా రక్తదాన శిబిరం

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిట్టబ్బాయి శనివారం తెలిపారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

April 18, 2026 / 02:11 PM IST