• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఇవాళ యలమంచిలి వాస్తవ్యులు ముదునూరి వెంకట లక్ష్మీపతి రాజు కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

April 14, 2026 / 12:13 PM IST

నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి

AKP: గొలుగొండలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేయడం జరుగుతుందని హోం మంత్రి అనిత అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేర నియంత్రణ చేస్తున్నామన్నారు.

April 14, 2026 / 12:12 PM IST

బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన మంత్రి

E.G: పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన పల్లా దానయ్య కుటుంబ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పరామర్శించారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కును మంత్రి అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 14, 2026 / 12:07 PM IST

అంబేద్కర్ అందరివాడు.. జిల్లా కిసాన్ సంఘం అధ్యక్షుడు

SKLM: రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని జిల్లా కిషన్ సంఘం అధ్యక్షుడు కోత మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని రాసిన రాజ్యాంగమే నేడు చలామణి అవుతుందని అన్నారు. సంగం నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 12:06 PM IST

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

సత్యసాయి: రామగిరి మండలం నసనకోట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పరిటాల సునీత పూలమాల వేసి నివాళులర్పించింది. ఈ సందర్బంగా ఆయన విగ్రహం దగ్గర ముగ్గులతో అలంకరించినటువంటి మహిళలకు చీరలను బహుమతిగా ఇచ్చారు.

April 14, 2026 / 12:05 PM IST

నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని అగంతకుడు దాడి

NTR: కంచికచర్ల వసంత కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో బాధితురాలికి భుజం, ఛాతి, ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 14, 2026 / 12:00 PM IST

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

ATP: నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, బండారు శ్రావణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:57 AM IST

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద గల ఆర్టీసీ డిపో గ్యారేజీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:56 AM IST

అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు వేదాయపాళెం పోలీసులు 30కు పైగా కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి, హుబ్లీలలో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.

April 14, 2026 / 11:56 AM IST

‘అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి’

ప్రకాశం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్  అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. మార్కాపురం ఎస్సీ సెల్ నాయకులతో కలిసి కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:50 AM IST

‘బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలి’

SKLM: బాల్యవివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. మంగళవారం మండలం గ్రామంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు హక్కులు, చట్టాలు పట్ల అవగాహన అవసరం అని, వాటి ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్నపడు హెల్మెట్ ధరించాలన్నారు.

April 14, 2026 / 11:47 AM IST

విద్యుత్ ట్రాన్స్‌షార్మర్ మంజూరు చేయాలని వినతి

PPM: విద్యుత్ ట్రాన్స్‌షార్మర్ మంజూరు చేయాలని RTI జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణారావు డిమాండ్ చేసారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కురుపాం మండలం మొండెంఖల్ గ్రామం లోవోల్టేజ్‌తో ఇబ్బందిగా ఉంది అన్నారు. ఒకటీ, రెండు, మూడు రోజులు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.

April 14, 2026 / 11:43 AM IST

ఘనంగా గంగాదేవి తల్లి పండుగ

AKP: గొలుగొండ మండలం సీ.హెచ్‌. నాగాపురం గ్రామంలో గంగాదేవి తల్లి పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.

April 14, 2026 / 11:41 AM IST

అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది: ఎమ్మెల్యే

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఈదరపల్లి, S.యానాం, ఉప్పలగుప్తం గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురం ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

April 14, 2026 / 11:40 AM IST

ఘనంగా అంబేద్కర్ జయంతి

VSP: విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

April 14, 2026 / 11:40 AM IST