• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్ డేలో ప్రజల సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

GNTR: గుంటూరు నగరంలోని జెకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిపై ఆయన వెంటనే స్పందించారు.

April 10, 2026 / 03:52 PM IST

మురుగు నీటి శుద్ధి కేంద్రం పరిశీలించిన కలెక్టర్

KRNL: దేవనగర్ సమీపంలో ఉన్న ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రం) ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. ప్లాంట్‌లో మురుగు నీటి శుద్ధి ప్రక్రియ, సామర్థ్యం, నిర్వహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగానికి ఉపయోగించే అవకాశాలపై సూచనలు చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

April 10, 2026 / 03:48 PM IST

పంజాబీ నేర్చుకునే విధానంపై వర్క్ షాప్

PLD: పంజాబీ చాలా తేలికైన, అందమైన భాష కొన్ని మెలకువలతో నేర్చుకోవడం సులువని సీహెచ్.నిఖిల్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని 75త్యాళ్ళూరు పీఎం శ్రీ ZP పాఠశాలలో పంజాబీ నేర్చుకునే విధానంపై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించాడానికి అవగాహన కల్పింస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 03:46 PM IST

కారు బోల్తా.. నలుగురికి గాయాలు

NDL: శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని అంబులెన్స్‌లో శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్  పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆరా తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 03:44 PM IST

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశేష పూజలు

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

April 10, 2026 / 03:44 PM IST

జిల్లాలో వినోబా భావే అనుచరుల “సద్భావన యాత్ర”

PPM: ఆచార్య వినోబా భావే స్థాపించిన మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుంచి “సర్వోదయ మండలి” సభ్యులు సద్భావన యాత్ర చేపట్టారు. ఈ యాత్ర రేపు మన జిల్లాలోకి రానుందని గాంధీజీ స్మారక నిధి ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, అహింస, సామాజిక సామరస్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని తెలిపారు.

April 10, 2026 / 03:43 PM IST

డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందు పిచికారి

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై. ఓ నంద‌లు ఇవాళ 45వ డివిజన్ సర్వేపల్లి కాలువ ప్రాంతంలో దోమల నివారణ చర్యలలో భాగంగా అత్యాధునిక డ్రోన్ల సహాయంతో మందు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల రహిత నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

April 10, 2026 / 03:40 PM IST

జిల్లా రైలు ప్రయాణికులకు శుభవార్త

ATP: జిల్లా మీదుగా నడిచే బెంగళూరు-కలబురగి (16563/64), బెంగళూరు-బీదర్ (16559/60), తిరుపతి-అకోలా (07605/06) ప్రత్యేక రైళ్లు ఇకపై సాధారణ ఛార్జీలు, రాయితీలతో రెగ్యులర్ రైళ్లుగా అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 10, 2026 / 03:40 PM IST

ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్

SS: ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

April 10, 2026 / 03:40 PM IST

జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పరమేశ్వర రావు నియమకం

శ్రీకాకుళం జిల్లా BJP అధికార ప్రతినిధిగా బైపల్లి పరమేశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ఈ ప్రకటన చేశారు. పరమేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.

April 10, 2026 / 03:36 PM IST

రేపు నర్సీపట్నంలో విద్యుత్ సరఫరా బంద్: ఈఈ

AKP: నర్సీపట్నం బలిఘట్టం పరిసర ప్రాంతాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని APEPDCIL EE రామకృష్ణ తెలిపారు. బలిఘట్టం, బయపురెడ్డిపాలెం, దుగ్గాడ, శ్రీరాంపురం,మెట్టపాలెం, కృష్ణాపురం, కళ్ళెంపూడి సీతయ్యపాలెం, ములకలపూడి బెన్నవరం ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

April 10, 2026 / 03:34 PM IST

తాగునీటి చలివేంద్రాల ప్రారంభం

KRNL: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరులో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు MLA జయనాగేశ్వర రెడ్డి పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. వీవర్స్ కాలనీ పెద్ద పార్క్ సమీపంలో, గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ సమస్యలకు గురికాకుండా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

April 10, 2026 / 03:32 PM IST

ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌కు 19 వినతులు

CTR: చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 19 వినతులు అందగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్భార్‌లో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని స్పందించారు.

April 10, 2026 / 03:25 PM IST

గుర్తేడులో ప్రజాదర్బార్ కార్యక్రమం

ASR: గుర్తేడు గ్రామంలో మొదటిసారి ప్రజాదర్బార్ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇటీవల 5 పంచాయతీలను ప్రభుత్వం గుర్తేడు మండలంగా ఏర్పాటు చేసింది. మొదటిసారి గుర్తేడు గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.

April 10, 2026 / 03:25 PM IST

జిల్లా డీఈవోకు స్టంట్ వేసిన వైద్యులు

ATP: జిల్లా డీఈవో ప్రసాద్ బాబు గుండె సంబంధిత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రసాద్ బాబు 15 రోజులు సెలవులో వెళ్లడంతో, ఇన్‌ఛార్జి డీఈవోగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ సిబ్బంది ఆకాంక్షించారు.

April 10, 2026 / 03:20 PM IST