ప్రకాశం: పొదిలి పట్టణ ప్రజలకు నగర కమిషనర్ మారుతీరావు మంచి అవకాశం కల్పించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని సూచించారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
VSP: ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి ఏడాదిలో 37,891 మందికి గానూ 32,334 మంది (85%) ఉత్తీర్ణులై రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. రెండో ఏడాదిలో 37,422 మందికి గానూ 32,034 మంది (86%) పాసై 7వ స్థానం దక్కించుకున్నారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CTR: మహిళల్లో వేగంగా పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్‌పై ముందస్తు పరీక్షలు, అవగాహన ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచించారు. ఈ మేరకు చిత్తూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన లోపంతో చాలా మంది మూడో, నాల్గో దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారన్నారని తెలిపారు. స్త్రీలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
TPT: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మట్టం శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. ఆమె ఇప్పటివరకు టీడీపీ తెలుగు మహిళ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటులో భాగంగా శ్రావణి రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అధిష్టానం నియమించడం జరిగింది. ఈ మేరకు పలువురు ఆమెను అభినందించారు.
AKP: జిల్లాలోని పాఠశాలల్లో పరిశుభ్రత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్త లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు భద్రత కోసం మొదటి అంతస్తులో నిద్రించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ATP: అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కోసం మొబిస్ ఇండియా కంపెనీ రూ.1.50 కోట్ల విలువైన LED వీడియో వాల్ స్క్రీన్‌ను అందజేసింది. ఎస్పీ పి.జగదీష్ ఈ సామాగ్రిని స్వీకరించి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చని అన్నారు.
ప్రకాశం: నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన చంద్రశేఖర్ 500 మార్కులకు 463 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రశేఖర్ మండలంలోని నేతివారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి.
PPM: పిల్లలను తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి, పాఠశాలలను బలోపేతం చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం చొక్కాపువానివలస గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 13.5 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అదనపు పాఠశాల గదులను ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
VZM: పేద ప్రజల ఆకలిని తీర్చి, వారికి రుచికరమైన ఆహారాన్ని అందించడానికే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన స్వచ్ఛ రథాలను, గజపతినగరం గ్రంథాలయ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
SKLM: మందసలో మహిళా సంఘాలను ఎంటర్ప్రైనర్లుగా తీర్చిదిద్దేందుకు వెలుగు సిబ్బందికి బుధవారం శిక్షణ నిర్వహించారు. ఏపీఎం పైడి కూర్మారావు మాట్లాడుతూ.. గ్రామాల్లో జీవనోపాధి రుణ ప్రణాళికలు సిద్ధం చేసి ఆమోదించుకోవాలని సూచించారు. స్త్రీనిధి, సీఐఎఫ్, బ్యాంక్ లింకేజ్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
KDP: ఇంటర్మీడియట్ ఫలితాల్లో పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు శ్రీజ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 411 మార్కులతో, సుస్మిత ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 950 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలో కళాశాల సిబ్బంది వారిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు.
అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేట గ్రామంలో సర్వే నెంబర్ 1183లో ఉన్న సుమారు 24 ఎకరాల గయాలు భూమిలో అర్హులైన పేదలు వందలాదిగా గుడిసెలు వేసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్ ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నివాస స్థల హామీని విస్మరించిందని విమర్శించారు.
అల్లూరి జిల్లాను జోన్-1లోనే కొనసాగించాలని ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాత్రుడు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సింహాద్రి కోరారు. ఈమేరకు బుధవారం పాడేరు విచ్చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాను జోన్-2లో చేర్చడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు.