• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ వినియోగంపై పోలీసుల అవగాహన డ్రైవ్

బాపట్ల జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. “శిరో రక్షా–ప్రాణ రక్షా” నినాదంతో హెల్మెట్ వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుందని, ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

April 14, 2026 / 06:55 PM IST

‘జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనే లక్ష్యం’

BPT: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ (IPS) పర్యవేక్షణలో మంగళవారం పలు జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ రైడ్లలో పలువురు జూదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

April 14, 2026 / 06:42 PM IST

‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమాన్ని గుంటూరు 21వ డివిజన్ యతిరాజుల కాలనీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు పున్నమ్మ కుటుంబానికి తొలి సోలార్ ప్యానెల్స్‌ను ఎమ్మెల్యే అందజేశారు.

April 14, 2026 / 06:40 PM IST

‘దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమైనవి’

CTR: కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్క‌ర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీ పార్థసారథి కార్యాలయ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

April 14, 2026 / 06:40 PM IST

‘డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించాలి’

ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని TDP ఇంఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ, మంత్రి నారా లోకేష్‌ను కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. కాలేజీకి భవనాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

April 14, 2026 / 06:39 PM IST

ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర

ELR: వేలేరుపాడు (మం) బండ్ల బోరు గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో మండల సమావేశం మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య మాట్లాడుతూ.. ఈనెల 17న పెద్ద వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అనేక లాభాలు కలుగుతాయని వివరించారు.

April 14, 2026 / 06:38 PM IST

‘భూములు వదులుకొనే ప్రసక్తే లేదు’

AKP: ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్ భూములను వదులుకునే ప్రసక్తే లేదని రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళిత రైతులు స్పష్టం చేశారు. భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత రైతులు ర్యాలీ నిర్వహించారు. తామంతా కుటుంబాలతో ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు.

April 14, 2026 / 06:37 PM IST

అంబేద్కర్ బొమ్మ గీసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

NLR: రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ఉదయగిరి మండలం పుల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి బొమ్మ గీసి పలువురిని అబ్బుర పరిచింది. రెండో తరగతి చదువుతున్న గాజులపల్లి చక్షిత్ రెడ్డి ఆ మహానీయుడు బొమ్మను చిత్రలేఖనం చేయడంపై పలువురు అభినందనలు తెలిపారు.

April 14, 2026 / 06:36 PM IST

గుడిపాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

CTR: గుడిపాల(M) లో టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తండ్రి, జీజేఎం డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అంబేద్క‌ర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. స్థానిక నేతలతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:35 PM IST

పిడుగురాళ్లలో అగ్నిమాపక వారోత్సవాలు

PLD: పిడుగురాళ్లలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 14 నుంచి 20 వరకు జరుగుతాయి. తొలిరోజు అగ్నిమాపక అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ సీఐ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాద నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. బుధవారం పెట్రోల్ బంకులు, గోడౌన్లు, మాల్స్‌లో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామని ఫైర్ ఆఫీసర్ కే.శ్రీనివాసరావు తెలిపారు.

April 14, 2026 / 06:35 PM IST

నార్పలలో జెండర్ వనరుల కేంద్రం ప్రారంభం

ATP: నార్పల మండల కేంద్రంలో జెండర్ వనరుల కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలకు చట్టపరమైన సాయం, కౌన్సెలింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామ సంఘ సహాయకులకు 200 స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు.

April 14, 2026 / 06:30 PM IST

శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత

NDL: ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలో భారీ స్థాయిలో ఇవాళ మద్యం సీసాలు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. RTC బస్టాండ్, సిద్దరామప్ప కాంప్లెక్స్‌లో దాడులు నిర్వహించారు. ఐదుగురు మహిళా నిందితుల నుంచి 314 క్వాటర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసార సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు నుంచి మద్యం తరలించి హోటళ్లలో పనిచేసే కార్మికులకు అమ్ముతున్నట్లు తెలిపారు.

April 14, 2026 / 06:29 PM IST

మొగులూరు KGBVలో ఫుడ్ పాయిజన్

NLR: గుడ్లూరు మండలం మొగులూరు గ్రామంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఇవాళ అస్వస్థతకు గురైన వారిని వెంటనే గుడ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

April 14, 2026 / 06:27 PM IST

డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ

ATP: శింగనమల నియోజకవర్గంలో పీఎంఏజేఏవై పథకం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీలేఖ రూ.34 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. బుక్కరాయసముద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి నుంచి ఆలం నరసనాయుడు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 14, 2026 / 06:15 PM IST

సోలార్ రూఫ్‌టాప్ యూనిట్ల ప్రారంభం

ప్రకాశం: పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రజలు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ముక్తినూతలపాడు కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఈ పథకం అమలుకు రూ.31.18 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

April 14, 2026 / 06:13 PM IST