• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బైరెడ్డి శబరి

NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి కృతజ్ఞతలు తెలియజేసింది.

April 15, 2026 / 01:14 PM IST

నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

VZM: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పోరాటంతో పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన లోకేశ్ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో, మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.

April 15, 2026 / 01:13 PM IST

అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు: కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించాలని సూచించారు.

April 15, 2026 / 01:10 PM IST

క్రికెట్ ఆడిన మంత్రి లోకేశ్

TPT: తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో షాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణులు పీవీ సింధు, మిథాలి రాజ్‌లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిని ప్రోత్సహించారు.

April 15, 2026 / 01:10 PM IST

ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ

కోనసీమ: మైనారిటీల అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన CM చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారులు అహమ్మద్ షరీఫ్‌కు బుధవారం మండపేట TDP రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మైనారిటీ విద్యా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు.

April 15, 2026 / 01:10 PM IST

కమలాపురంలో ఓ పాఠశాలకు నోటీసులు జారీ

కడప: కమలాపురం ఓ పాఠశాలకు ఎంఈఓ బేబీ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్నట్లు గుర్తించారు. అవసరమైన వసతులు లేకపోవడంతో గతంలో అనుమతి నిరాకరించినప్పటికీ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. నోటీసుల అనంతరం స్కూల్ మూసివేతతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

April 15, 2026 / 01:09 PM IST

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన చరిత

KRNL: గూడూరు మండలం పెంచికలపాడుకు చెందిన గాడే చరిత ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988 మార్కులు సాధించి సత్తా చాటింది. నంద్యాల జిల్లా నెరవాడ ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతూ ఆమె ఈ ఘనత సాధించింది. తన తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ తనను చదివించారని చరిత పేర్కొంది. ఫలితాలలో పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

April 15, 2026 / 01:09 PM IST

గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చిత్తూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వారి చదువుల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 15, 2026 / 01:07 PM IST

సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

E.G: నిడదవోలులో ఈ నెల 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం అయ్యేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.

April 15, 2026 / 12:43 PM IST

విద్యుత్ కేంద్రంలో మరమ్మత్తు పనులు

ATP: గుత్తి 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున హై వోల్టేజ్ కారణంగా 132 కేవీ సీటీ పేలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిటీలను మరమ్మతు పనులను చేపట్టారు.

April 15, 2026 / 12:40 PM IST

లోకేష్‌కు ఎమ్మెల్యే సునీత అభినందనలు

ATP: TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందనలు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి ఇది తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత దృఢంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

April 15, 2026 / 12:39 PM IST

గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ

VZM: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నియోజకవర్గ స్థాయి గ్రామ సంఘాల సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన 5G స్మార్ట్ ఫోన్‌లను బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీ నాయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలలో పనిచేస్తున్న 146 మంది సహాయకులకు స్మార్ట్ ఫోన్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడ భాస్కరరావు, చింతల రామకృష్ణ పాల్గొన్నారు.

April 15, 2026 / 12:37 PM IST

ఇంటర్ ఫలితాల్లో KGBV విద్యార్థుల ప్రతిభ

KRNL: ఇంటర్ ఫలితాల్లో పెద్దకడబూరు KGBV విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కే.నాగలక్ష్మి 448/470, కే. సమీరా 447/470, ఏ.కవిత 437/470 టాపర్ లుగా నిలిచారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో K.G నాగలక్ష్మి 958/1000, ఇందు 916/1000 టాపర్‌లుగా నిలిచినట్లు ప్రిన్సిపల్ రుక్సానా పర్వీన్ తెలిపారు. ఫస్ట్ ఇయర్‌‌లో 90 %, సెకండ్ ఇయర్‌లో 73% పాస్ పర్సంటేజ్ నమోదయింది.

April 15, 2026 / 12:34 PM IST

యువత క్రీడల్లో రాణించి దివిసీమ ఖ్యాతి పెంచాలి: ఎమ్మెల్యే

కృష్ణా: యువత క్రీడల్లో రాణించి దివిసీమ ఖ్యాతి పెంచాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కోడూరులో ఇవాళ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ప్రోత్సహించారు. నిర్వాహకుడు బచ్చు వెంకటేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు.

April 15, 2026 / 12:31 PM IST

మున్సిపల్ ఆఫీసులో సర్వర్ సమస్య

PLD: చిలకలూరిపేట పురపాలక కార్యాలయంలో సర్వర్ పనిచేయడం లేదు. దీంతో పన్నులు చెల్లించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తి, నీటి పన్నులు కట్టడానికి వచ్చి గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. పనులు మానుకుని వస్తే సాంకేతిక లోపం అంటూ అధికారులు చెప్పడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.

April 15, 2026 / 12:29 PM IST