• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘తప్పులకు తావులేకుండా మూల్యాంకన ప్రక్రియ జరగాలి’

PPM: పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి మార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, కోడింగ్-డీకోడింగ్ ప్రక్రియలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురంలో నిర్వహిస్తున్న మూల్యాంకన ప్రక్రియను సందర్శించారు.

April 9, 2026 / 04:25 PM IST

‘న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలి’

కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని కర్నూలు న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు. గురువారం పీలేరు బార్‌లో అడ్వకేట్ విధులు నిర్వహిస్తున్న పూజారి ఎల్లయ్య అనే న్యాయవాదిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యకు నిరసనగా న్యాయవాదుల సంఘం కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు.

April 9, 2026 / 04:25 PM IST

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి’

CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలలోనూ విజయం సాధించాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. కుప్పం మండలం మోట్లచేను పంచాయతీ టీడీపీ సమన్వయ సమావేశం గురువారం ఆయన నిర్వహించారు. విజయం కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

April 9, 2026 / 04:24 PM IST

నకిలీ టికెట్ల వ్యవహారంలో ఏడుగురు అరెస్ట్

ELR: ద్వారకతిరుమల శ్రీవారి దర్శనం నకిలీ టికెట్ల వ్యవహారంలో గురువారం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇతరుల సహాయంతో నకిలీ సాఫ్ట్‌వేర్ రూపొందించి టికెట్లను తయారుచేసి కౌంటర్లో విక్రయించారన్నారు. దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసామన్నారు.

April 9, 2026 / 04:24 PM IST

సుందరయ్య కాలనీలో సమస్యలను తీర్చండి సార్..!

KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె సుందరయ్య కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం పంచాయతీ కార్యదర్శి నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. భూపోరాటం ద్వారా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

April 9, 2026 / 04:22 PM IST

65వ రోజుకు చేరిన దళిత రైతుల నిరసన

AKP: భూములు స్వాధీనానికి వ్యతిరేకంగా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 65వ రోజుకు చేరుకున్నాయి. సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమనాయుడు, శివాజీ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములను తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపాలన్నారు.

April 9, 2026 / 04:20 PM IST

కందుకూరులో NTR వైద్య సేవలు ప్రారంభం

NLR: కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు NTR వైద్య సేవలను ప్రారంభించారు. మూడు తరాలుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కోటారెడ్డి కుటుంబాన్ని ఆయన అభినందించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే 1200 మందికి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

April 9, 2026 / 04:20 PM IST

కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి

SKLM: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రణస్థలంలోని రెడ్డీస్ ల్యాబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఉన్న బాయిలర్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, RDO కె. సాయి ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 04:13 PM IST

రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీ..!

TPT: నాగలాపురం మండలం కొడియంబేడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న కారు, లారీ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 04:11 PM IST

అనుమానాస్పదంగా వృద్ధుడి మృతి

VSP: ఆనందపురం మండలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు పైల నారాయణ స్వామి(60)గా ఆనందపురం పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

April 9, 2026 / 04:11 PM IST

టీ స్టాళ్లు, పాన్ షాపులపై ప్రత్యేక తనిఖీలు

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్, సత్యనారాయణపేట, బోయపేట ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలో ఉన్న పెట్టి షాపులు, టీ స్టాళ్లు, పాన్ షాపులపై అధికారులు బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

April 9, 2026 / 04:06 PM IST

పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం

PLD: దాచేపల్లిలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తహసీల్దార్ జీ. శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, కరెంటు స్తంభాల దగ్గరలో ఉండవద్దని తెలిపారు. వీఆర్వోలు తమ పరిధిలోని గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కాగా, పరిసర మండలాల్లో వర్షం కురుస్తుండగా, దాచేపల్లిలో ఆకాశం మేఘావృతమైంది.

April 9, 2026 / 04:03 PM IST

వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం: తహసీల్దార్

TPT: రెవెన్యూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని సత్యవేడు నూతన తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన, సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం వినతులను స్వీకరిస్తామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

April 9, 2026 / 04:02 PM IST

జడ్పీ హైస్కూల్లో అడ్మిషన్ల సందడి!

BPT: సంతమాగులూరు (మం) ఏల్చూరులో గురువారం అడ్మిషన్ల డ్రైవ్ ముమ్మరంగా సాగింది. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు తొలుత ఎంపీపీ విద్యార్థులతో మాట్లాడి, అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను 6వ తరగతిలో తమ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడిలో మెరుగైన సదుపాయాలను ఉన్నాయని తెలిపారు.

April 9, 2026 / 04:02 PM IST

రేపు అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు

ప్రకాశం: కనిగిరిలో రేపు అమ్మవారిశాల నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు ఉంటుందని దేవస్థానం ఛైర్మన్ దేవకి శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరి కనిగిరి పురవీధుల్లో ఊరేగింపుగా ఎమ్మెస్సార్ రోడ్డు ఆంధ్ర బ్యాంకు వీధీమీదగా అమ్మవారి శాల బజారుకు ఈ ఊరేగింపు ఉంటుందని తెలిపారు.

April 9, 2026 / 03:57 PM IST