KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఇవాళ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఖండించారు. దశాబ్దాల పాటు బిల్లును అమలు చేయలేక ఇప్పుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 33% రిజర్వేషన్ చట్టం ఆమోదం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. జనగణన, డిలిమిటేషన్ అనంతరం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు.
KDP: మన్నూరు పరిధిలోని వరదాయపల్లిలో CI లింగప్ప ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, చీటింగ్, తదితర నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. డిలిమిటేషన్ అంశాన్ని మహిళా బిల్లుతో ముడిపెట్టి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ హడావిడిగా వీటిని తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
W.G: యువతను ప్రభావితం చేసే విధంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటి వైపు యువత మరలకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మూడో దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ తణుకు కూటమి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
KKD: యుకొత్తపల్లి మండలం విలేకరి మోర్త రవిపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో కాలు ఇరిగిపోయింది. దీంతో ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ తో పిఠాపురం నియోజకవర్గ విలేకరులు కొత్తపల్లి ఎస్సై జి వెంకటేష్ కు వినతిపత్రం అందించి దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
PPM: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా బాగుంటే కూటమి ప్రభుత్వం పాలనలో ఏ ఒక్కరూ బాగుపడిన పరిస్థిలేదు అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మండలం సంగం వలస గ్రామంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు.
శ్రీకాకుళం: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణ చర్యలు మరింత బలోపేతం కావాలని పోలీసులకు సూచించారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వారిని పట్టుకొని కోర్టులో హాజరుపరచాలన్నారు.
ASR: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం కిండంగి గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ ప్రధాన చెరువునకు జల హారతి ఇచ్చి, పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో తూములను, చెక్ డ్యామ్‌లను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను గ్రామస్తులతో కలిసి తొలగించారు. ఎంపీడీఓ తేజ్ రతన్ పాల్గొన్నారు.
KKD: డీ లిమిటేషన్ బిల్లు పేరుతో దక్షిణ భారత దేశానికి అన్యాయం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకుండా బిల్లులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
VSP: ట్రాఫిక్ ఏసీపీగా మహాదాస్యం శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1991 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన విజయనగరం ఎస్డీపీఓగా విధులు నిర్వర్తించి బదిలీపై నగరానికి వచ్చారు. గతంలో మధురవాడ ఏసీపీగా, టూ టౌన్, గాజువాక, పీఎం పాలెం స్టేషన్లలో ట్రాఫిక్ ఎస్సై, సీఐగా సేవలు అందించారు.
VZM: గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే అద్భుతాలు సాధిస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని పెదమేడపల్లి గ్రామానికి చెందిన రెడ్డి తేజస్విని 1000కు 991 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఈ సందర్బంగా మంత్రి ఆమెను అభినందించి సన్మానించారు.
SKLM: కేంద్రంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి అడ్డు కోవడాన్ని నిరసిస్తూ శనివారం శ్రీకాకుళం లోని 7 రోడ్ల కూడలి వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇండియా కూటమి నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమికి అడ్రస్ లేకుండా చేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
కోనసీమ: దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గించాలని మోడీ పన్నిన కుట్రలో భాగమైన CM చంద్రబాబు ,Dy.CM కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ CM జగన్ ఈ ముగ్గురు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నవారేనని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. మండపేటలో ఇవాళ కామన మాట్లాడుతూ.. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయాలని మోడీ ఆలోచించారన్నారు.
సత్యసాయి: కేరళలో పర్యటిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొచ్చిన్‌లోని అమృత సెంటర్ ఫర్ నానోసైన్సెస్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. డాక్టర్ శాంతికుమార్ నాయర్, డాక్టర్ జయకుమార్ రంగసామి సహా పలువురు నిపుణులతో ఆమె చర్చలు జరిపారు. అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఎమ్మెల్యే.. పాత పరిచయాలను గుర్తుచేసుకున్నారు.
BPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్లికురవ మండలం వైదన గ్రామపంచాయతీలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసి, అక్కడి వసతులను పరిశీలించారు.