KDP: తొండూరు మండలంలోని ఇనగలూరులో ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో కారు ధ్వంసమైంది. ఎస్సై ఘన మద్దిలేటి కథనం మేరకు.. ఇనగలూరు గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు అమ్మాయి విషయమై కక్ష పెంచుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
CTR: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 16న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మని నాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.
TPT: నాగలాపురం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో బీ.కే. వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించగా, దేవస్థానం పరిశుభ్రత, ప్రసాదాల నాణ్యతను ఈవో ప్రశంసించారు.
ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో కార్యవర్గం ఎన్నిక అయ్యిందని ఏఐటీయూసీ నూతన ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఇవాళ కాకినాడలో పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ నూతన నాయకత్వాన్ని పరిచయం చేశారు. అధ్యక్షులుగా తాటిపాక మధు, ఉపాధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొబ్బిలి శ్రీనివాసరావు నియమితులయ్యారని వెల్లడించారు.
CTR: నగరి మున్సిపాలిటీ కీలపట్టు బీసీ కాలనీలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో యువతకు క్రీడా పరికరాలు, విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి ప్రోత్సహించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే, స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
TPT: పుత్తూరు పరిధిలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణ, రోడ్డు భద్రత గురించి వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలపాలని కోరారు.
SKLM: పోలాకి మండలం ఈదులవలస ఏపీ మోడల్ పాఠశాల ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ప్రిన్సిపల్ పైడి ప్రవీణ తెలియజేశారు. 344 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 332 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారి యు. శాంతారావు పరీక్షను పర్యవేక్షించారు
PPM: ప్రపంచ శాంతికి అహింస ఒక్కటే మార్గమని చాటిన మహాత్మా గాంధీ, వినోబా భావేల ఆశయాలు నేటికీ సజీవమని “భూదాన్ స్మృతి విచార్, సద్భావనా యాత్ర” నిరూపిస్తోంది. మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుండి తెలంగాణలోని పోచంపల్లి వరకు సాగుతున్న ఈ యాత్ర మన్యం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఆత్మీయ సమావేశం పార్వతీపురంలో నిర్వహించారు.
SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను కలిసి తమ సమస్యలపై వినతులు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు తమ విజ్ఞప్తులను ఆమెకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
ATP: గుత్తి రైల్వే ఎస్సీ, ఎస్టీ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు ఇవాళ క్విజ్ కాంపిటేషన్ పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీల నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ.. ఈనెల 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ఈ క్విజ్ పోటీలను నిర్వహించామన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జయంతి రోజున బహుమతులను అందజేస్తామన్నారు.
E.G: చిరకాల వాంఛ, దశాబ్దాల కల అయిన మహిళలకు లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని ఇవాళ రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి మహిళలందరి తరుపున ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సాధికారత అంటే కేవలం ఒక నినాదం కాదన్నారు.
CTR: నగరి మండలం వి.కె.ఆర్ పురానికి చెందిన దామోదర్ నాయుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆయనను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇవాళ స్వగృహంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలు వచ్చారు.
ప్రకాశం: రేపు ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
SKLM: లావేరు మండలం బెజ్జిపురం–తమాడ రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీలలిత మోడ్రన్ మినీ రైస్ మిల్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధికి దోహదం చేస్తాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ శాఖా గ్రంధాలయం జనరల్ బాడీ సమావేశం ఛైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతనలో ఇవాళ జరిగింది. గ్రంధాలయాన్ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ వన్‌గా మార్చాలని ఒక తీర్మానాన్ని చేశారు. గ్రంధాలయానికి పాఠకుల సంఖ్య పెంచాలనేది లక్ష్యాన్ని పెట్టుకున్నామని, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.