SKLM: జిల్లాలో పారిశ్రామి కాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం జూమ్ యాప్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.
VZM: తప్పులు లేకుండా ఇళ్ల గణన ఆన్ లైన్ చేయాలని ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లను బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ రామలక్ష్మి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జన గణనపై మూడో విడత శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి జన గణన చేయాలన్నారు. జన గణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్‌తో పాటు సిబ్బంది స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజలు కూడా ఆన్‌లైన్ ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని బుధవారం సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ వారంలోగా నమోదు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
W.G: బంగారం బదిలీ పేరుతో నరసాపురంలోని ఓ బ్యాంకు ఉద్యోగిని నమ్మించి నగదు కాజేసిన ముగ్గురిపై కేసు నమోదైంది. వేరే బ్యాంకులో గోల్డ్‌లోన్ ఉందని, నగదు ఇస్తే అక్కడ కట్టి విడిపించుకొని ఈ బ్యాంకులో పెడతామని సన్నీ, తబు, జరీనాలు రూ.1.70 లక్షలు జమ చేయించుకుని పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ప్రసాద్ ఫిర్యాదు చేయగా SI జయలక్ష్మి కేసు నమోదు చేశారు.
ATP: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై విజిబుల్ పోలీసింగ్‌తో పాటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి అతివేగం, మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కృష్ణ: ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జడ్పీ హైస్కూల్‌లో రూ.31.16 లక్షలతో దాత వేగె లక్ష్మి శ్రీనివాసరావు నిర్మించిన అదనపు తరగతి గదులను MLA యార్లగడ్డ వెంకట్రావు బుధవారం రాత్రి ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యసాధన చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
PLD: నరసరావుపేట రోటరీ క్లబ్‌లో ఖరీఫ్ 2026-27కు ప్రత్తి, మిరప విత్తన సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు అధ్యక్షతన కంపెనీలు తమ ప్రణాళికలను వివరించాయి. నాణ్యమైన విత్తనాలు సమయానికి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
PPM: ఈనెల 24న సీతంపేట మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. CM చంద్రబాబు వర్చువల్ ప్రారంభించనున్నారని నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈ మేరకు సీతంపేటలో శుక్రవారం నుంచి పేదలకు రూ.5కు భోజనం అందుబాటులోకి రానుంది. ఏరియా ఆసుపత్రి సమీపంలో అన్న క్యాంటీన్ ఉన్నందున రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: గార (M) శ్రీకూర్మం గ్రామం నుంచి సుమారు 35 కుటుంబాలు బీజేపీ పార్టీలోకి చేరారు. బుధవారం సాయంత్రం వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణు గోపాలం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు.
NTR: సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్ల వినియోగం పెరుగుతుండగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి కొందరు ప్రమాదాల తర్వాత కార్లు వదిలి పారిపోతున్నారు. ఈ కేసుల్లో డ్రైవర్లను గుర్తించడం కష్టంగా మారింది. తప్పుడు వివరాలు, ఫేక్ ఐడీలు ఇవ్వడం వల్ల విచారణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు తెలిపారు.
VZM: జనవరి నెల నుంచి ప్రణాళికబద్దంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీపై ఆర్డీవోలు, తహసీల్దార్ల, సర్వే సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
CTR: చౌడేపల్లి మండలంలో భావన మహర్షి వేడుకలను పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు. భావన మహర్షి భద్రావతి దేవిలా చిత్రపటాలను ఏర్పాటు చేసి వేద పండితులచే ప్రత్యేక పూజలు చేశారు. కుల దైవంగా భావించే పద్మశాలి కులస్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితులచే ఆశీర్వచనం పొందారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఫైర్ ఆఫీస్ సమీపంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. మద్యం సేవించిన వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. హుండీలో ఎంత నగదు పోయిందో తెలియాల్సి ఉంది. ధర్మకర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
W.G: అత్తిలి మండలంలో బాలిక (17)పై అత్యాచార యత్నానికి పాల్పడిన పవన్ సాయి అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 20న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా, నిందితుడు లోపలికి ప్రవేశించి అకృత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు SI విశ్వనాథ్ చెప్పారు.
ASR: గొలుగొండ మండలంలో మంగళ, బుధవారాల్లో కురిసిన ఆకస్మిక ఈదురుగాలులతో కూడిన వర్షాలు మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలు గ్రామాల్లో తోటల్లో కాయలు నేల రాలిపోయాయి. ఎంతో శ్రమించి పెంచిన పంట ఇలా దెబ్బతినడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి సహాయం అందించాలని వారు కోరుతున్నారు.