• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 6న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అన్నమయ్య: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం PGRS కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మదనపల్లిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు.

April 5, 2026 / 04:22 PM IST

గుంటూరు పశ్చిమలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ గారి సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

April 5, 2026 / 04:20 PM IST

పాటిల్ తిమ్మమ్మ @100 ఇయర్స్

ATP: బెలుగుప్పలో పాటిల్ తిమ్మమ్మ 100వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. వందేళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

April 5, 2026 / 04:20 PM IST

ఏయూలో స్వచ్ఛ వారోత్సవ్ ప్రారంభం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ వారోత్సవ్ కార్యక్రమాన్ని వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించారు. అవుట్‌గేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్యులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు, అధ్యాపకులు పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.

April 5, 2026 / 04:17 PM IST

11 సీసీ కెమెరాలు ఏర్పాటు

AKP: ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమన్నపాలెం, లైనుకొత్తూరు, మర్రిబంధ గ్రామాల్లో ముఖ్య జంక్షన్లలో గ్రామ పెద్దల సహకారంతో 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు నేరాలు నియంత్రణకు దోహదపడతాయన్నారు. నేరాలు జరిగితే నిందితులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

April 5, 2026 / 04:17 PM IST

సెట్టింతంగల్ చెక్‌పోస్ట్ వద్ద విజిబుల్ పోలీసింగ్

CTR: ఎన్‌ఆర్ పేట ఎస్సై సెట్టింతంగల్ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రతను పెంపొందించడం, శాంతి భద్రతలను కాపాడడం, అక్రమ కార్యకలాపాలను నిరోధించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టారు.

April 5, 2026 / 04:16 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

VZM: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు.

April 5, 2026 / 04:15 PM IST

మాజీ మంత్రిని పరామర్శించిన ప్రభుత్వ విప్

PPM: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు. ఆదివారం ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 04:12 PM IST

స్కూల్ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు.. విచారణకు డిమాండ్

KDP: జిల్లా వ్యాప్తంగా జరిగిన ఓపెన్ ఇంటర్, పదవ తరగతి, పరీక్షల్లో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి విద్యార్థి నుండి రూ. 5,000 వసూలు చేశారని కోఆర్డినేటర్ సాంబశివా రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏఐబిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయక్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

April 5, 2026 / 04:12 PM IST

మాచర్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

PLD: సమానత్వం–న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని మాచర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్క్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

April 5, 2026 / 04:00 PM IST

నెల్లూరులో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం

నెల్లూరు రూరల్ 37వ డివిజన్ క్రాంతి నగర్‌లో రూ.కోటితో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో వందల కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలాగా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

April 5, 2026 / 04:00 PM IST

జిల్లా పర్యటనకు మంత్రి నిమ్మల రాక

ATP: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి సోమవారం ఉదయం అనంతపురం చేరుకుంటారు. అనంతరం యాడికిలో సీఎం చంద్రబాబు పాల్గొనే ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు.

April 5, 2026 / 04:00 PM IST

‘నిజమైన రాజకీయ దిక్చూచి బాబు జగ్జీవన్ రామ్’

NTR: విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఆయన చూపిన మార్గమే నిజమైన రాజకీయ దిక్సూచి అని అన్నారు. సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 04:00 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం

TPT: శ్రీసిటీ పరిధిలోని తొండూరులో కండ్రిగ ధనశేఖర్‌కు చెందిన గడ్డివాము విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇటీవల పశువుల మేత కోసం సేకరించిన సుమారు 200 మోపుల గడ్డి అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

April 5, 2026 / 03:46 PM IST

ఈ వెండి పట్టీ ఎవరిదో.?

CTR: బంగారుపాళ్యం ఆటో స్టాండ్ వద్ద ఓ వెండి కాలి పట్టి దొరికినట్లు పోలీసులు తెలిపారు. దానిని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచినట్లు వారు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు తగిన గుర్తింపు ఆధారాలతో స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 03:43 PM IST