• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పూలే సేవలను స్మరించిన వైసీపీ నేతలు

GNTR: గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

April 11, 2026 / 01:36 PM IST

‘యువత పూలేను ఆదర్శంగా తీసుకోవాలి’

AKP: యువత మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు. పరవాడ సంతబయల జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేమన్నారు.

April 11, 2026 / 01:33 PM IST

పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

PLD: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

April 11, 2026 / 01:26 PM IST

‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం: మంత్రి

అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెంలో జరిగిన సూర్యఘర్ ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో మంత్రి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జలధార ప్రాజెక్టు విజయానికి విశేష కృషి చేసిన కలెక్టర్‌ను మంత్రి ఘనంగా సన్మానించారు.

April 11, 2026 / 01:26 PM IST

భీమవరంలో మహాత్మ పూలే జయంతి కార్యక్రమం

W.G: భీమవరం తహసిల్దార్ ఆఫీస్ ఆవరణలో విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూలే సేవా సమితి అధ్యక్షులు M.V.R. అప్పాజీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు పూలే అన్నారు. షేక్ కాసిం, అల్లు శ్రీనివాస్, బాషా తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:25 PM IST

‘అణగారిన వర్గాల ఆశాజ్యోతికి ఘన నివాళి’

​PPM: పుస్తక పఠనమే సామాజిక మార్పుకు పునాది, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మార్పు సాధ్యం ఆని DRO కె.హేమలత అన్నారు. ఈ​కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, రచనలను చదవడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

April 11, 2026 / 01:25 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

April 11, 2026 / 01:24 PM IST

సివిల్స్ విజేతను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం నడిమవలస పంచాయతీకి చెందిన సివిల్స్ విజేత సౌరోతు రాము ఇవాళ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను సన్మానించి, మాట్లాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి అహర్నిశలు శ్రమించి ఉన్నత లక్ష్యానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి రాము అని తెలిపారు. రాముని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

April 11, 2026 / 01:23 PM IST

పూలే జయంతి వేడకల్లో పాల్గొన్న MLA

KDP: ప్రొద్దుటూరులో శనివారం ఉదయం ‘జ్యోతిరావు పూలే’ జయంతి కార్యక్రమంలో స్థానిక MLA నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ముక్తియార్, రాజగోపాల్ పాల్గొన్నారు.

April 11, 2026 / 01:21 PM IST

జ్యోతి బాపూలేకు మంత్రి సవిత నివాళి

సత్యసాయి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక విప్లవకారుడిగా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో ప్రభుత్వం పయనిస్తుందని పేర్కొన్నారు.

April 11, 2026 / 01:17 PM IST

పేదలకు CMRF గొప్ప వరం: MLA

NDL: నందికొట్కూరు పట్టణం ABM పాలెంకు చెందిన ఇద్దరికీ రూ. 91,000 విలువైన CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సురేంద్ర నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:15 PM IST

పూలే విగ్రహనికి నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే

BPT: బాపట్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీల్ రోడ్ సెంటర్‌లోని పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పిల్లవాడు విద్యకు దూరంగా ఉండకూడదన్నారు. సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

April 11, 2026 / 01:13 PM IST

రాజ గోపుర పునః నిర్మాణానికి శంకుస్థాపన

W.G: నరసాపురం శ్రీ ఆదికేశవ స్వామి వారి దేవస్థాన రాజగోపుర పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామివారు ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ఈ పుణ్య కార్యానికి శంఖుస్థాపన చేశారు.

April 11, 2026 / 01:11 PM IST

మహాత్మ జ్యోతిరావు పూలేకు మంత్రి, కలెక్టర్ నివాళి

NDL: పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మణీయమన్నారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:11 PM IST

పూలే జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

GNTR: సామాజిక విప్లవయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయాలను కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.

April 11, 2026 / 01:11 PM IST