• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న కలెక్టర్

W.G: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘటితంగా ఉండటం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని సామాజిక సమానత్వం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.

April 14, 2026 / 05:23 PM IST

‘కసి, పట్టుదలతో ఎవరెస్ట్ వైపు ప్రత్యేక విద్యార్థులు’

GNTR: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా 21 మంది విద్యార్థులతో కూడిన బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 16 రోజులపాటు జరిగే ఈ యాత్రలో విద్యార్థులు ఖాట్మండు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.

April 14, 2026 / 05:20 PM IST

‘ఉద్యోగులపై అన్యాయ కేసులు రద్దు చేయాలి’

ELR: ఏపీ కో-ఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరుకు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ర్యాలీ భీమడోలు చేరుకుంది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్నివీరాంజనేయులు వారికి స్వాగతం పలికి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉద్యోగులపై అన్యాయపు కేసులు రద్దుచేసి రాజకీయ ప్రేరేపిత విచారణలు నిలిపివేయాలని కోరారు.

April 14, 2026 / 05:20 PM IST

‘పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం’

ASR: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయ సాధకుడిగా, పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు.

April 14, 2026 / 05:14 PM IST

రైల్వే గేటు వద్ద ప్రమాదం.. యువకుడు మృతి

TPT: ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వెంకటగిరి(M) కాంపాలెం గ్రామానికి చెందిన శ్రీను రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటే క్రమంలో బైకు అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 14, 2026 / 05:14 PM IST

‘సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించే రోజు రావాలి’

AKP: సబ్బవరం మండల కేంద్రంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించే రోజు వచ్చినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.

April 14, 2026 / 05:13 PM IST

బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ అప్పలస్వామి, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 05:13 PM IST

విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల, సాయంత్రం 5:45 గంటలకు బదులుగా 6:45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని కోరారు.

April 14, 2026 / 05:12 PM IST

నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం

SKLM: జిల్లాలో మత్స్య సంపద పునరుత్పత్తిని కాపాడేందుకు సముద్రంలో చేపల వేటపై ఇవాళ అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జూన్ 16 వరకు కొనసాగే ఈ నిషేధ కాలంలో వేట సాగిస్తే చేపల గుడ్లు, ఉత్పత్తులు నశించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఈ 61 రోజుల పాటు వేటకు దూరంగా ఉండి సహకరించాలని మత్స్యశాఖ అధికారులు కోరారు.

April 14, 2026 / 05:05 PM IST

నా వద్ద అద్భుత శక్తులు ఉన్నాయి అంటూ మోసం..!

CTR: పెద్దపంజనిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వద్ద అద్భుత శక్తులు గల వస్తువు ఉందని నమ్మించి ఓ బాధితుడి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

April 14, 2026 / 05:00 PM IST

బొమ్మూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు

E.G: బొమ్మూరులోని అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నివాళులర్పించారు. క్యాంపస్ నియామకాలతో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం ఉచిత కోచింగ్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 05:00 PM IST

‘అంబేద్కర్ ప్రపంచ మేధావి’

ELR: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

April 14, 2026 / 04:56 PM IST

టిప్పర్ కింద పడి వృద్ధుడు మృతి..!

ప్రకాశం: ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామం సమీపంలో మంగళవారం టిప్పర్ లారీ కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. టిప్పర్ రివర్స్ చేసుకునే క్రమంలో టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వృద్ధుడు టిప్పర్‌ను ఢీకిని టైర్ల మధ్య పడి నలిగిపోయాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

April 14, 2026 / 04:50 PM IST

చోడవరంలో గ్రామసభ ఏర్పాటు

AKP: చోడవరం మండల కేంద్రంలో ఇవాళ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

April 14, 2026 / 04:44 PM IST

‘తాగునీటి సమస్యలు ఉంటే తెలపండి’

ASR: రాజవొమ్మంగి గ్రామ సచివాలయంలో ఎంపీడీవో యాదగిరేశ్వరావు మంగళవారం గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరారు. ముర్లవానిపాలెంలో తాగునీరు సమస్య నెలకొందని, చేతి పంపు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

April 14, 2026 / 04:44 PM IST