• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు

ప్రకాశం: కనిగిరిలో రేపు అమ్మవారిశాల నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు ఉంటుందని దేవస్థానం ఛైర్మన్ దేవకి శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరి కనిగిరి పురవీధుల్లో ఊరేగింపుగా ఎమ్మెస్సార్ రోడ్డు ఆంధ్ర బ్యాంకు వీధీమీదగా అమ్మవారి శాల బజారుకు ఈ ఊరేగింపు ఉంటుందని తెలిపారు.

April 9, 2026 / 03:57 PM IST

హైవేపై ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

NLR: వరికుంటపాడు సమీపంలో 565 జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పేలి బోల్తా పడిన ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బోల్తాపడ్డ ఆటో మర్రిపాడు మండలం పొంగూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 03:50 PM IST

రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ నినాదాలు

ATP: ఏబీఎన్ రాధాకృష్ణ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శింగనమలలో వైసీపీ శ్రేణులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. బస్టాండ్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర మహిళలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

April 9, 2026 / 03:50 PM IST

గర్నిమిట్ట PHCలో పోషణ పక్వాడకు శ్రీకారం

అన్నమయ్య: కే.వీ.పల్లి మండలంలోని గర్నిమిట్ట PHCలో ఇవాళ్టి నుంచి 23 వరకు పోషణ పక్వాడ ప్రారంభమైంది. తల్లి-శిశు పోషణ, చిన్నారుల మెదడు ప్రారంభ దశ అభివృద్ధి, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు సమాజ పాత్రపై అవగాహన కల్పించారు. స్క్రీన్ టైమ్ తగ్గించి పిల్లలతో సమయం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:46 PM IST

సీఐటీయూ సభల కరపత్రాల విడుదల

KRNL: ఆదోని పట్టణంలోని సుందరయ్య భవనంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను గోపాల్, తిప్పన్న, లక్ష్మన్న గురువారం విడుదల చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి కార్మిక హక్కులను రక్షించాలని CITU నాయకులు కోరారు. సభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

April 9, 2026 / 03:41 PM IST

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు.!

GNTR: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేసింది. స్థానిక బాలాజీ రావు పేటలోని తడికల మిల్లు సమీపంలో ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి గాను స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. 

April 9, 2026 / 03:36 PM IST

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కైలే

కృష్ణా: పామర్రులో ABN రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి పీఎస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

April 9, 2026 / 03:31 PM IST

చిప్పగిరిలో మాతృత్వ ఆరోగ్య శిబిరం

KRNL: చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.డా.అఫ్రోజ్ బేగం ఆధ్వర్యంలో గర్భిణీలకు రక్తపోటు,హీమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేసి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

April 9, 2026 / 03:28 PM IST

సచివాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

KDP: కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ కవిత ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.పెరుగుతున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రహ్లాద రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 9, 2026 / 03:24 PM IST

రేపు మార్కాపురానికి సినీ, జబర్దస్త్ ఆర్టిస్టులు

మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రేపు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు తన్మై, దొరబాబు, శాంతి కుమార్, రైసింగ్ రాజ వస్తున్నారని నిర్వాహకులు తెలపారు.

April 9, 2026 / 03:24 PM IST

ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణ

PLD: నూజెండ్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027లో భాగంగా ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజెండ్ల ఎమ్మార్వో రమేశ్, ఏఎస్వో నాగశ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్యూమరేటర్‌లు 26 మంది, సూపర్వైజర్‌లు ఐదుగురు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:21 PM IST

సంతమాగులూరులో 8వ ‘పోషణ్ పక్వాడా’ ప్రారంభం

BPT: సంతమాగులూరులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీడీపీవో డీ. సుధా మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆమెతో పాటు డాక్టర్ జోష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:20 PM IST

‘గర్భవతులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి’

NLR: గర్భవతులు తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని CDPO సునీత తెలియజేశారు. గురువారం ICDS ప్రాజెక్టు ఆత్మకూరు పరిధిలోని సంగం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలను PMMVY ప్రోగ్రాం కింద నిర్వహించారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

April 9, 2026 / 03:20 PM IST

ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన హజ్ కమిటీ డైరెక్టర్

E.G: నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్ పర్యవేక్షించారు. గురువారం చేపట్టిన మట్టి తవ్వకాలు, కాలువలను పరిశుభ్ర పరిచే పనులను పర్యవేక్షించి, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా కొనసాగాలని, కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.

April 9, 2026 / 03:20 PM IST

‘​ఆరు నెలల్లో లబ్బర్తికి మంచినీరు’

ASR: రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ కింద రూ.69 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. కేవలం 6 నెలల్లో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

April 9, 2026 / 03:12 PM IST