కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీ చేపట్టిన బీసీల 5 డిమాండ్లకు బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం మద్దతు తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, కులగణన, 44% రిజర్వేషన్లు వంటి డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 11న ఆమరణ దీక్షను విజయవంతం చేయాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VZM: ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన తగాదాలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కోర్టులో శాశ్వత లోక్ అదాలత్‌పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకింగ్, బీమా, విద్యాసంస్థలు, ఆస్తి, ఉపాధి హామీ పథకం, రవాణా, పోస్టల్, విద్యుత్, నీటి సరఫరా తదితర వాటిని రాజీ చేసుకోవాలన్నారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి జిల్లా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల అందుబాటు వంటి అంశాలపై చర్చించారు.
అన్నమయ్య: రాజంపేటలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తామని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రకటించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ నెల 16న పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోగుల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొని, హిందీ భాష అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
ELR: కలిదిండి మండలం మూలలంక నుంచి పెద్దలంక ప్రధాన రహదారినీ గురువారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. 2 కోట్ల రూపాయిల నిధులుతో నాలుగు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించిన BT రోడ్డును ప్రారంభించారు. మిగిలిన 1.5 కిలోమీటర్ల రోడ్డును BT రోడ్డుగా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.
KDP: శ్రీ సత్య సాయి జిల్లా కోడికొండ చెకోపోస్ట్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే VN పల్లె మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుతో మండలంలో భూముల ధరలు పెరుగుతాయని రైతులు, రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ హైవే నిర్మాణం మళ్లీ జీవం పోస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగుదలపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పారిశుధ్యంపై ఎలాంటి రాజీ పడకుండా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ASR: డుంబ్రిగూడ మండలం జాముగూడ–కోర్రాయి గ్రామాల మధ్య రహదారి, బ్రిడ్జి నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోవడంతో సుమారు 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అన్నారు. తక్షణమే రహదారి, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని గురువారం నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు కూడా అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.
PPM: సురక్షితమైన ప్రసవం, తల్లీ బిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా గర్భిణిలకు వైద్య సేవలు అందించాలని జిల్లా ఆర్.బి ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీఎంఎస్ఎమ్ఏ కార్యక్రమాన్ని గురువారం తనిఖీ చేశారు. అనంతరం గర్భిణీల ఆరోగ్య పరీక్షల వివరాలు పరిశీలించారు.
ATP: వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలవాలని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఓ.ఆనంద్‌తో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధిస్తూ మానవ వనరుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
GNTR: సైబర్ నేరాలను అరికట్టడంలో బ్యాంకులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ‘సైబర్ నేరాలను జయించడానికి ఐక్యంగా’ అనే నినాదంతో గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
TPT: తిరుపతి జిల్లా పిచ్చటూరు ICDS పరిధిలోని గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో “పోషణ పక్వాడా” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. సీడీపీవో సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పిల్లల సమగ్ర అభివృద్ధి, పోషకాహారంపై అవగాహన పెంపొందించాలని సూచించారు.
SKLM: హిరమండలంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. గురువారం అంగురు కాలనీల్లో సంచరిస్తున్న కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. బాధితుల కాళ్లపై తీవ్రంగా గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
సత్యసాయి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడా పేరుతో పదిహేను రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. అందులో భాగంగా రొళ్ల మండలం వన్నారన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు వివిధ అంశాలను వివరించారు. సంపూర్ణ పోషణ, పిల్లల ఎత్తు, బరువుల నమోదు, రక్తహీనత నివారణ, పారిశుద్ధ్యం, వర్షపునీటి నిల్వ తదితర అంశాలపై అవగాహన కల్పించారు