BPT: అమృతలూరు మండలం కూచిపూడి ఎల్‌జీ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: గుర్ల ఎస్సై నారాయణరావు ఆద్వర్యంలో స్థానిక పోలీసులు మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు. ఈ మేరకు ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్, ప్రమాదాల నివారణ, తదితర అంశాలపై ఆవగాహన కల్పించామని ఎస్సై తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 నిర్వహణకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే స్వీయ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
కోనసీమ: సోలార్ యూనిట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రామరాజులంకలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి యోజన పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇళ్లపై సోలార్ రూఫ్ ఏర్పాటు వల్ల విద్యుత్ ఖర్చు ఆధా అవుతుందన్నారు.
NDL: బనగానపల్లెలో జరిగిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని సహించలేకే ఆయన విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కాటసాని అవినీతికి ప్రతీక అని మండిపడ్డారు. అభివృద్ధి పనులు దాతల సహకారంతో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని న్యాయ అధ్యయన విభాగం లా సెట్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు విభాగాధిపతి విజయలక్ష్మి తెలిపారు. 5 ఏళ్ల LLB కోర్సు లక్ష్యంగా పెట్టుకున్న AP అభ్యర్థులకు రెండు వారాల ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్నవారు న్యాయ విభాగ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుమార్తె ఎం.దీక్షిత(14) మిస్సింగ్‌పై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఇన్చార్జ్ సీఐ మనోహర్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. దీక్షిత కనబడుటలేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఆచూకీ 9440796823, 94407968215కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
CTR: జీడీ నెల్లూరు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు స్వామి దాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీసీ బ్యాంకు ఎదురుగా నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. థామస్ చేతులు మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
TPT: సోషల్ మీడియా ద్వారా తిరుమలలో వీఐపీ దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Facebook, వాట్సప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి UPI ద్వారా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులు చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ రెడ్డి, బొడిరెడ్డి చెన్నకేశవులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
AKP: సౌర విద్యుత్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. సబ్బవరం సాయి నగర్ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్‌ను మంగళవారం ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. మిగులు విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్ కు సరఫరా ద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు.
CTR: నేపాల్లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో రామకుప్పం వీర్నమలకు చెందిన నవీన్ విజయం సాధించాడు. భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి దేశ గౌరవాన్ని పెంచిన నవీన్ ను చిత్తూరు కలెక్టర్ సమిత్ కుమార్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో MP దగ్గుమల్ల ప్రసాదరావు, MLC కంచర్ల శ్రీకాంత్, వికాస్ మర్మత్ పాల్గొన్నారు.
PPM: గ్రామాల్లో అనుమానిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ కోరారు. ఈ మేరకు మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. సైబర్ క్రైమ్, పోక్సో చట్టాలపై ఆటో ద్వారా అవగాహన కల్పించారు.
కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు (78) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హాసనాబాద్‌లో జరిగిన ఆయన అంతిమయాత్రలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాడె మోశారు. వీరభద్రరావు మృతి పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. పూల వ్యాపారం చేస్తున్న లీలమ్మ ఉదయం 9 గంటలకు బయట వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. తలుపులు బద్దలు కొట్టి ఉండడం చూసి దొంగలు పడ్డట్టు గుర్తించారు. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని రూ.67 వేలు, 350 గ్రాముల వెండి నగలు కనిపించలేదు.
KDP: కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి మరొక అడుగు పడనుంది. నేడు MLA పుత్తా చైతన్య రెడ్డి, TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం ఫైర్ ఇంజన్ వాహనం ప్రారంభంతో కార్యక్రమాలు ప్రారంభమై, TDP ఆఫీసు వద్ద ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ జరుగుతుందని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.