• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రిని పరామర్శించిన ప్రభుత్వ విప్

PPM: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు. ఆదివారం ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 04:12 PM IST

స్కూల్ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు.. విచారణకు డిమాండ్

KDP: జిల్లా వ్యాప్తంగా జరిగిన ఓపెన్ ఇంటర్, పదవ తరగతి, పరీక్షల్లో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి విద్యార్థి నుండి రూ. 5,000 వసూలు చేశారని కోఆర్డినేటర్ సాంబశివా రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏఐబిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయక్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

April 5, 2026 / 04:12 PM IST

మాచర్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

PLD: సమానత్వం–న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని మాచర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్క్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

April 5, 2026 / 04:00 PM IST

నెల్లూరులో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం

నెల్లూరు రూరల్ 37వ డివిజన్ క్రాంతి నగర్‌లో రూ.కోటితో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో వందల కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలాగా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

April 5, 2026 / 04:00 PM IST

జిల్లా పర్యటనకు మంత్రి నిమ్మల రాక

ATP: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి సోమవారం ఉదయం అనంతపురం చేరుకుంటారు. అనంతరం యాడికిలో సీఎం చంద్రబాబు పాల్గొనే ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు.

April 5, 2026 / 04:00 PM IST

‘నిజమైన రాజకీయ దిక్చూచి బాబు జగ్జీవన్ రామ్’

NTR: విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఆయన చూపిన మార్గమే నిజమైన రాజకీయ దిక్సూచి అని అన్నారు. సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 04:00 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం

TPT: శ్రీసిటీ పరిధిలోని తొండూరులో కండ్రిగ ధనశేఖర్‌కు చెందిన గడ్డివాము విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇటీవల పశువుల మేత కోసం సేకరించిన సుమారు 200 మోపుల గడ్డి అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

April 5, 2026 / 03:46 PM IST

ఈ వెండి పట్టీ ఎవరిదో.?

CTR: బంగారుపాళ్యం ఆటో స్టాండ్ వద్ద ఓ వెండి కాలి పట్టి దొరికినట్లు పోలీసులు తెలిపారు. దానిని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచినట్లు వారు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు తగిన గుర్తింపు ఆధారాలతో స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 03:43 PM IST

‘దేశ పురోగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర మరువలేనిది’

కృష్ణా: దేశ పురోగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర మరువలేనిదని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ నేరెళ్లపాలెం బస్టాప్ వద్ధ భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వెంకట్రామ్ నివాళులర్పించారు.

April 5, 2026 / 03:35 PM IST

‘అవినీతి, దోపిడీ జగన్‌కు రెండు కళ్లు’

PLD: మాజీ సీఎం జగన్‌పై చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, దోపిడీ జగన్‌కు రెండు కళ్లు అని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ తీరు మారలేదన్నారు. రాజధాని అమరావతిపై జగన్ చిమ్మే ప్రతి విషపు బొట్టు ఆయన పతనానికే దారి తీస్తుందని హెచ్చరించారు. అమరావతిని బలపరిస్తేనే వైసీపీకి ప్రజల్లో స్థానం ఉంటుందన్నారు.

April 5, 2026 / 03:30 PM IST

ఎస్పీ ఆదేశాలతో ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్లతో రద్దీగా ఉండే ప్రాంతాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, ప్లాట్ఫామ్లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు.

April 5, 2026 / 03:30 PM IST

రేపటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రాకూడదని, ఈ మార్పును ప్రజలు గమనించాలని కోరారు.

April 5, 2026 / 03:30 PM IST

ఎంపీ వేమిరెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్

NLR: పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6 నుంచి 19 వరకు దామరమడుగు గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టీడీపీ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షులు జగదీష్ తెలిపారు. డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

April 5, 2026 / 03:30 PM IST

అమరావతే మన రాజధాని: MLA

CTR: ‘దేవతల ఏలుబడి అమరావతి.. అమరావతే మన రాజధాని’ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. బుద్ధుడు నడిచిన పవిత్ర నేల అమరావతి ఏపీ ఏకైక రాజధానిగా అవతరించిందని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం కృషి చేసి రాజధానికి చట్టబద్ధత తీసుకువచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

April 5, 2026 / 03:28 PM IST

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు’

VZM: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పట్టణంలోని మహిళా పోలీసు స్టేషనులో మనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్ రామ్ ముఖ్యపాత్ర పోషించారన్నారు.

April 5, 2026 / 03:19 PM IST