VSP: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని బుధవారం రాత్రి కొయ్యూరు సీఐ వెంకటరమణ, మంప ఎస్సై శంకరరావు ఆధ్వర్యంలో కొయ్యూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి గుడ్లపల్లి జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో సీఐ, ఎస్సైలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హింసకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతి మార్గం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.