KDP: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం చిన్నమండెం మండలంలోని బొ రెడ్డి గారి పల్లెలోని తన నివాసం నందు మంత్రి ప్రజాదర్బార్లో వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.