KRNL: కల్లూరు అర్బన్ 30వ వార్డు షరీన్ నగర్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి గురువారం హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.