SKLM: నరసన్నపేట మండలం పారసెల్లి ప్రభుత్వ పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ మెండ సింహాచలం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తికరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.