SKLM: పలాసలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కాశీబుగ్గ ఎస్సై చందర్రావు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి మాట్లాడుతూ.. పలాస కాశీబుగ్గ జంట పట్నంలో గంజాయి మద్యం రోజురోజుకి అధికమవుతుందన్నారు. ఇలాంటి దుర్ఘటన భవిష్యత్తులో పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.