ప్రగతి భవన్ ముట్టడించాలని భావించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్ఆర్ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు.
దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షర్మిల కారు డోరు తీయకపోవడంతో కారు మెకానిక్‌ను అక్కడికి రప్పించారు. కారు డోర్లు తెరచి షర్మిలను కారులోంచి బయటకు రప్పించారు పోలీసులు.
నర్సంపేటలో తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన షర్మిల ప్రగతిభవన్‌కు వెళ్లాలని భావించారు. నిన్న దాడి జరిగిన కారులోనే ఆమె బయలుదేరారు.