»We Will Defeat Jagan We Will Come To Power And See The End Pawan Kalyan
Andhrapradesh: జగన్‌ని ఓడిస్తాం..అధికారంలోకి వచ్చి అంతు చూస్తాం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై, సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు నాలుగో విడత వారాహి యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో జనసేనాని భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైందని చెప్పారని, కానీ కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని పవన్ విమర్శించారు. 100 మందికి పైగా ఉన్న వైసీపీ నేతలే కౌరవులని, కాబట్టి వాళ్లు ఓడిపోవడం ఖాయమన్నారు.
ఆంధప్రదేశ్‌లోని అవనిగడ్డలో డిఎస్సీ శిక్షణ తీసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ఎంతో మంది వస్తారని, ఇప్పుడు ఏపీలో 30 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు వేలకు వేలు ఖర్చు పెట్టినా వారికి తగిన ప్రయోజనం కలగడం లేదన్నారు. డీఎస్సీ జాడ లేదని మండిపడ్డారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం ఈసారి ఓట్లను చీలనివ్వమని, వైసీపీని దించేయడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన, టీడీపీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయన్నారు.
వైసీపీని దించడమే తమ లక్ష్యమన్నారు. జగన్ వేల కోట్లు దోచేసి ఇంకా దోచుకుంటూనే ఉన్నాడన్నారు. సినిమాల టికెట్లు 5 రూపాయలు చేస్తాడని, అందరూ తన వద్దకు వచ్చి దేహీ అనాలన్నది జగన్ ఆలోచన అని పవన్ దుయ్యబట్టారు. ప్రజల డబ్బునే దోచుకుంటే, ప్రజలకే ఏదో పంచిపెడుతున్నట్లుగా సీఎం జగన్ నటిస్తున్నాడన్నారు. ప్రైవేటు సైన్యాన్ని కూడగట్టుకుని అనేక దోపిడీలకు వైసీపీ సర్కార్ పాల్పడుతోందన్నారు.
జగన్ లాంటి అధికార మదంతో ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు. కానీ తన వద్ద ఓట్లను కొనడానికి డబ్బులు లేవన్నారు. నేను ప్యాకేజీ తీసుకున్నానని వైసీపీ సన్నాసులు చెబుతున్నారని, వారిదంతా పచ్చకామెర్ల వ్యవహారమని అన్నారు. తాను కేవలం డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటే మాదాపూర్ ఏరియాలో 10 ఎకరాలు కొనేవాడ్ని అని, ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.