»18 Young People Arrested In Anantapur For Distributing Ganja
Anantapurలో 18 మంది అరెస్టు..గంజాయి గుప్పిట్లో యువత!
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
18 young people arrested in Anantapur for distributing ganja
ఏపీలోని అనంతపురం(anantapur) పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో రెండు ముఠాలకు చెందిన 18 మంది యువకులను శనివారం అరెస్టు చేశారు. అంతేకాదు వారి నుంచి 21 కిలోల గంజాయి, 18 మొబైల్లు, రెండు ఆటోరిక్షాలు, మూడు మోటర్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం డివిజన్లోని ఐ, ఐవి టౌన్ పోలీసులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు సూపరింటెండెంట్ కె.కె.ఎన్.అన్భురాజన్ తెలిపారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించేది లేదన్నారు.
అనంతపురం శివార్లలోని చెరువుకట్ట దేవాలయం సమీపంలో ఐ టౌన్ పోలీసులు తొమ్మిది మంది యువకులను అరెస్టు చేయగా, పట్టణంలోని తపోవనం సర్కిల్ వద్ద ఐవి టౌన్ పోలీసులు మరో తొమ్మిది మందిని పట్టుకున్నారు. అంతేకాదు నిందితులంతా 20 ఏళ్లలోపు యువకులేనని పోలీసులు(police) పేర్కొన్నారు. 18 మంది నిందితుల్లో 17 మంది అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా, ఒకరు కాకినాడకు చెందినవారని తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి నిల్వలను తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతపురం పరిసర ప్రాంతాల్లో విక్రయించి మంచి లాభం పొందడమే ఈ ముఠాల పని అని ఎస్పీ తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను లక్ష్యంగా చేసుకుని పలు రకాల వస్తువుల్లో వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. త్వరలోనే మరికొంత మందిని అరెస్టు చేస్తామని ఎస్పీ(SP) ఈ సందర్భంగా స్పష్టం చేశారు.