గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు దొరక్కుండా ఈ సారీ కొత్త ప్లాన్ వేశారు. ఆరోగ్యానికి మంచిది అని మిల్క్ షేక్‌లో కలుపు స్పెషల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులు రైడ్‌తో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
If you drink a milk shake with cannabis, you will stay drunk for seven hours
Viral News: దేశంలోని యువతను పీడిస్తున్న గంజాయి ప్రభుత్వం కల్లు కప్పి తిరుగుతుంది. రూపం, రూటు మార్చుకొని విస్తృతంగా వ్యాపిస్తోంది. దాన్ని అమ్మి సొమ్ము చేసుకునే అక్రమార్కుల పాలిట లక్ష్మీ దేవిగా మారుతోంది. దాన్ని పీల్చీ యువత మత్తుకు బానిసై వారి భవిష్యత్తును నిరివీర్యం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు గంజాను పోగగా తాగడం వరకే తెలుసు, కొద్ది రోజులుగా గంజాను స్వీట్లో పెట్టి తీసుకుంటున్నారని విన్నాము. ఇప్పుడు ఏకంగా జ్యూస్‌ల వరకు వచ్చింది. మాములుగా బయట దొరికే మిల్క్ షేక్‌లలో గంజాయిని కలిపి అమ్ముతున్నారు. పైగా ఇది ఆరోగ్యానికి మంచిది అని ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో రెండ్రోజుల క్రితం బయటపడింది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్వోటీ) పోలీసులు పక్కా సమాచారంతో మనోజ్‌కుమార్ అగర్వాల్ అనే కిరణషాప్ ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఇతని సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు నిర్దారించుకున్నారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా మిల్క్ షేక్, పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి పొడి కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతను రెచ్చగొడుతున్నారు. ఇక వీటిని తాగితే ఏడు గంటలపాటు మత్తులో ఉంటున్నారు. దీనికి అలవాటు పడిన వారు పదే పదే తాగుతున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.