»Female Head Constable Dies After Falling Into Nala At Bhadrachalam
Nala:లో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.
తెలంగాణలో వర్షం వస్తే చాలు ప్రజలు భయాందోళన చెందే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వర్షం వస్తే హైదరాబాద్ సహా ప్రధానమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం. దీంతోపాటు ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచి వాహనాదారులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అనేక చోట్ల నాలాల సమస్య కూడా దారుణంగా తయారైంది.
ఇటివల హైదరాబాద్లో ఓ చిన్నారి నాలాలో పడి మృత్యువాత చెందిన ఘటన మనం చుశాం. ఇది మరువకముందే తాజాగా భద్రాచలం ఆలయ పరిధిలోని నాలాలో పడి ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మరణించింది. శ్రీదేవి కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. అయితే తన విధుల్లో భాగంగా భద్రాచలం ఇవాళ వచ్చారు. ఆ క్రమంలో రాములోరి ఆలయాన్ని దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ నేపథ్యంలోనే సత్రం సమీపంలోని ఓ నాలా ఉప్పొంగి ప్రవహించింది.
దీంతో అటువైపు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. విషయం తెలుసుకున్న మిగతా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఓ కాలువ సమీపంలో ఆమె మృతదేహం లభ్యంకావడంతో పోలీసులు విచారం వ్యక్తం చేశారు. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం అనేక ప్రాంతాల్లో 1,798 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.