Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో (Kakinada SEZ) మల్టీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై స్థానికులు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ పార్క్ వివరాలను వివరించే ప్రయత్నం చేశారు. కే.పెరుమాళ్లపురం పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా దిగి, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎంఐపీ (MIP) ఏర్పాటు గురించి అనుమానాలు ఉంటే తెలుపాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. అయినప్పటికీ గ్రామస్థులు వినిపించుకోలేదు. పోలీసులు వచ్చి గ్రామస్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నో యూజ్.. తమకు ఎంఐపీ (MIP) వద్దంటే వద్దు అని కూర్చున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు కే పురుమాళ్లపురం, ఏ.వీ నగరం, తొండంగి, కోదాడ, రమణక్కపేట, మూలపేటకు చెందిన గ్రామ ప్రజలు హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో (Kakinada SEZ) 4072 ఎకరాల్లో రూ.2500 కోట్లతో మల్టీ ప్రాడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ప్రజల అభిప్రాయం అడగగా.. వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎంఐపీ (MIP) ఏర్పాటుపై సందేహాలు నెలకొన్నాయి.